వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్ స్పందించరా -తాత పేరు తీసేసినా : సోషల్ మీడియాలో రచ్చ..!!

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు చేర్చుతూ ఏపీ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. దీని పైన టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విశ్వవిద్యాలయం స్థాపించింది ఎన్టీఆర్ అని..వైఎస్సార్ కు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ వాదన మరోలా ఉంది. రాష్ట్రంలో వైద్య రంగానికి వైఎస్సార్ సంస్కరించిన నేతగా నిలిచిపోయారని..ఆయన పేరు సమంజసమని చెప్పుకొచ్చారు. అయితే, అనూహ్యంగా ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ వైపు మళ్లింది.

తారక్ స్పందించాంటూ డిమాండ్

తారక్ స్పందించాంటూ డిమాండ్

తాత ఎన్టీఆర్ పేరు మార్చితే జూ ఎన్టీఆర్ స్పందిచరా అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అనుకూల - వ్యతిరేకులుగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు - సమాధానాలతో హోరెత్తుతోంది. జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు తన సతీమణి గురించి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సభ బహిష్కరించటం.. కన్నీటి పర్యంతమైన సమయంలో నందమూరి కుటుంబం మద్దతు ప్రకటించింది. వైసీపీ నేతలను హెచ్చరించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అందులో వైసీపీ నేతల గురించి మాట్లాడకపోవటం పైన కొందరు టీడీపీ నేతలు ఓపెన్ గానే జూ ఎన్టీఆర్ పైన విమర్శలు చేసారు. ఇక, తాజాగా..కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో హైదరాబాద్ కేంద్రంగా జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు.

హరిక్రిష్ణ సన్నిహితుడు యార్లగడ్డ రాజీనామా

హరిక్రిష్ణ సన్నిహితుడు యార్లగడ్డ రాజీనామా


ఆ సమావేశం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇది సినిమాకు సంబంధించి అభినందన అని కొందరు చెప్పినా.. రాజకీయంగా సాగిన సమావేశమేనంటూ ఆ తరువాత బీజేపీ నేతలే చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చటం.. వైఎస్సార్ పేరు చేర్చటం పైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంకు పునరాలోచన చేయాలని కోరారు. ఎన్టీఆర్ కుటుంబానికి..అందునా నందమూరి హరిక్రిష్ణకు ఆప్తుడు అయిన అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసారు. ఆ సమయంలోనూ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఇప్పుడు పలువురు ఇప్పుడు తాత పేరు ఏపీ ప్రభుత్వం తొలిగించినా స్పందిచరా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా

జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా


దీనిని కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. తారక్ ను ప్రశ్నిస్తున్నవారిని తప్పు బడుతున్నారు. కొందరు అభిమానులు..అన్నా ఇప్పుడు కూడా స్పందించకపోతే బాధ కలుగుతుందన్నా అంటూ పోస్టింగ్ లు చేసారు. గతంలో చంద్రబాబు పర్యటనల సమయంలో పలు ప్రాంతాల్లో జూనియర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలంటూ కుప్పం తో సహా పలు ప్రాంతాల్లో అభిమానులు డిమాండ్ చేసారు. కానీ, దీని పైన చంద్రబాబు ఎక్కడా స్పందించలేదు. గోరంట్లు బుచ్చయ్య చౌదరి లాంటి వారు మాత్రం పార్టీకి జూనియర్ సేవలు అవసరమంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేసారు. ఇక, ఇప్పుడు ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా లేక మౌనంగానే ఉంటారా అనేది చూడాల్సి ఉంది.

English summary
Disucssion on Junior NTR for not responding over the name change in NTR Health Univerity.ఎ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X