NTR: రాజకీయాలను సమూలంగా మార్చిన శక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ, వెంకయ్య నాయుడు కితాబు
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు రాజకీయాలలోని తనకంటూ ఒక విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న మేరునగధీరుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి నేడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బక్కని నర్సింహులు తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గురించి, ఆయన రాజకీయ రంగంలోనూ, సినీ రంగంలోనూ చేసిన సేవను గురించి కొనియాడారు.

ఎన్టీఆర్ అంటే ఒక శక్తి; బాలయ్య కితాబు
బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అన్నారు. ఆయన సాధారణ రైతు కుటుంబంలో పుట్టారని, చదువుకు తొలి ప్రాధాన్యత, ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చారన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని పేర్కొన్న ఆయన నటనకు విశ్వవిద్యాలయంగా, సినీరంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న తరుణంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారని, ఒకే పంధాలో వెళుతున్న రాజకీయాలను సమూలంగా మార్చారని తెలిపారు.
రాజకీయాలను సమూలంగా మార్చిన మహనీయుడు ఎన్టీఆర్
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు, ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. అంతకుముందు రాజకీయాలు కొంతమందికే పరిమితమై ఉండేవని, ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత డాక్టర్లు, లాయర్లు, అభిమానులు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.
ఆయన పెట్టిన పథకాలే నేటికీ
అధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టారని బాలకృష్ణ కితాబిచ్చారు. ఆయన పెట్టిన పథకాలను ఇప్పటికి కూడా అన్ని పార్టీలు అవలంభిస్తున్నాయి అని బాలకృష్ణ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ను స్మరించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆయనను స్మరించుకున్నారు. తెలుగు వారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అంటూ ఆయన పేర్కొన్నారు.చలనచిత్ర రంగంలో పురాణ పురుషుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రజానీకాన్ని మెప్పించి, ఇంటింటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకున్నారన్నారు.
ఎన్టీఆర్ గొప్పతనం చెప్పిన వెంకయ్య నాయుడు
ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ నవ శకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారని కితాబు ఇచ్చారు. గొప్ప జాతీయ వాది అయిన ఎన్టీఆర్ నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు అంకురార్పణ చేసి, మార్గదర్శిగా నిలిచి మహానేతగా మన్ననలు అందుకున్నారని కొనియాడారు. మహిళలకు ఆస్తి హక్కు, అధికార వికేంద్రీకరణ సహా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప సంస్కరణ వాది ఎన్టీఆర్ అన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications