ఎన్టీఆర్ జయంతి: ఆ సంకల్పం తీసుకుందాం.. చంద్రబాబు, లోకేష్ ఆసక్తికర పోస్టులు!!
స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి నేడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ, విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆయనను స్మరించుకుంటున్నారు. ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు.
చంద్రబాబు, లోకేష్ ఎన్టీఆర్ పై ఆసక్తికర పోస్టులు
టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ ను నేడు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఉద్దేశించి తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి.. అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ పాలనకు చంద్రబాబు కితాబు
క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్...తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని కితాబిచ్చారు.
పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటిన ఎన్టీఆర్
పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని, ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారన్నారు.
తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం.
— N Chandrababu Naidu (@ncbn) May 28, 2024
క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి.… pic.twitter.com/43x1dhzQeY
ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం: చంద్రబాబు
ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఆత్మబంధువు అయ్యారన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం...ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుజాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్: లోకేష్
ఇక మరోవైపు నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో లోకేష్ తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.
తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలుగుజాతి ఆత్మగౌరవం,ప్రజల సంక్షేమం,రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య… pic.twitter.com/Sh3eowLqtP
— Lokesh Nara (@naralokesh) May 28, 2024
ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా: లోకేష్
తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు కూడా ఆయనే అన్నారు. అన్నయ్య ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని, తాతయ్య నందమూరి తారకరామారావు గారే నాకు నిత్య స్ఫూర్తి అని లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications