అవమానం: ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టిన ఆగంతకులు
ఎన్టీఆర్‌కు అవమానం జరిగింది. గుంటూరులో ఆయన విగ్రహాన్ని ఆగంతకులు దగ్ధం చేశారు. దీంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది.
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరంంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టారు. దీంతో విగ్రహం పైభాగం పాక్షికంగా ధ్వంసమైంది. విగ్రహానికి ఎదురుగా ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని కూడా దుండగులు తగులబెట్టారు.
సంఘటన వివరాలు తెలిసిన వెంటనే తహసీల్దార్ పీసీహెచ్ వెంకయ్య, రూరల్ సీఐ యు శోభన్ బాబు, రూరల్ ఎస్‌ఐ ఉదయబాబు పోత వరం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఇప్పటికే కొద్దిమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రెండురోజుల క్రితం గ్రామంలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీని కూడా దుండగులు పాక్షికంగా తగులబెట్టారు.

ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వెళితే ప్రజలు వారిని బంగాళఖాతంలో కలుపుతారని మంత్రి పుల్లారావు అన్నారు. పోతవరంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభి వృద్ధిని ఓర్చుకోలేనివారే ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు.
పోత వరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తగులబెట్టిన సంఘటనకు వైసీపీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని ఎలాంటి సంబంధం లేదని జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications