ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్చేశారు: కొత్త పేరేమిటంటే..?
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరు మారిపోయింది. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌గా కొత్తగా నామకరణం చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వలు జారీ చేశారు. ఇకపై ఈ పథకం పేరు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా చలామణిలో ఉంటుంది.

కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలకు పేర్లు మార్చడం సర్వ సాధారణం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును తాను అధికారంలోకి వచ్చిన తరువాత మార్చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును తొలగించి, దానికి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టారు.

తాజాగా- మరోసారి అధికారం చేతులు మారింది. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే- తన తండ్రి అమలు చేసిన పాత పథకానికి ఆయన పేరునే పెట్టారు.












Click it and Unblock the Notifications