ఏర్పాట్లు మామూలుగా లేవు: కూతురి పెళ్లికి నరేంద్ర చౌదరి ఎక్కడా తగ్గట్లేదు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సంపన్నుల కుటుంబాల్లో పెళ్లిళ్లంటే ఖర్చు కోట్లల్లోనే ఉంటుంది. ఇన్విటేషన్ కార్డు నుంచి పెళ్లిలో వడ్డించే మెనూ దాకా ప్రతీ దాంట్లోను తమ ప్రత్యేకత ఉండాలని తాపత్రయపడుతుంటారు. బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహంలో ఎంత హడావుడి చేశారో తెలిసిందే.

ఇప్పుడు ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి సైతం తన కుమార్తె వివాహాన్ని అంతే వైభవంగా నిర్వహించబోతున్నారని టాక్. పెళ్లి కోసం ప్రత్యేకంగా 250శుభలేఖలు డిజైన్ చేయించారట. ఈ కార్డు విలువ ఒక్కోటి రూ.1.50వేలకు పైమాటే అంటున్నారు. సూట్ కేసు తరహాలో ఉండే ఈ ఇన్విటేషన్ కార్డులో వెండి, బంగారు వస్తువులు, పట్టు చీర, పట్టు పంచె, పెట్టి, కావాల్సిన పెద్దలను ఆహ్వానిస్తారట.

ntv managing director narendra chowdary spends huge money for daughters marriage

ఇక ఇదే పెళ్లి కోసం రూ.లక్ష విలువ చేసే మరో రెండు వందల శుభలేఖలు డిజైన్ చేయించారట. లక్షకు పైగా చదరపు అడుగుల్లో ముంబై ఆర్ట్ డైరెక్టర్స్ తో పెళ్లి మండపాన్ని ముస్తాబు చేయిస్తున్నారట. పెళ్లి భోజనం విషయంలోను పదుల సంఖ్యలో మెనూను సిద్దం చేస్తున్నారట.

పెళ్లి ఖర్చే ఇంత భారీగా ఉందంటే.. కట్నం కూడా భారీగానే ముడుతుండవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి కోసం అల్లుడుకి రూ.50కోట్ల విలువ చేసే ఓ చాపర్ ను కూడా నరేంద్ర చౌదరి గిఫ్ట్ గా ఇచ్చారట. చాలామంది వీవీఐపీలకు ఇప్పటికే శుభలేఖలు కూడా చేరిపోయాయట. ఇక పెళ్లి రోజు హంగామా ఎలా ఉంటుందో చూడాలి మరి!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The wedding of NTV chairman Narendra Chowdary's daughter rumoured to cost huge money.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X