ఇండియాలో నెంబర్ వన్ ఫాస్టెస్ట్ ట్రైన్
భారతీయ రైల్వే ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ పరంగా నాలుగోస్థానంలో నిలిచింది. ప్రస్తుతం కొత్త రైల్వే మార్గాలు వేస్తుండటంతో త్వరలోనే రెండోస్థానానికి, ఆ తర్వాత మొదటి స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు 13,600 ప్రయాణికుల రైళ్లు, 8వేల గూడ్స్ రైళ్లు నడుస్తుంటాయి. రోజుకు రెండుకోట్ల మంది ప్రయాణికులను 13,600 రైళ్ల తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. అతి తక్కువ ఖర్చుతో, భద్రత పరంగా ఉన్న ప్రయాణం కావడంతో ప్రయాణాలు చేసేవారంతా మొదటి ప్రాధాన్యత రైల్వేకు ఇస్తుంటారు. అక్కడ రిజర్వేషన్లు దొరక్కపోతేనే మిగతా సాధనాలవైపు చూస్తుంటారు.
గంటకు 160 కిలోమీటర్ల వేగం
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన రైళ్లను రైల్వే ప్రవేశపెడుతోంది. ఇలా ప్రవేశపెట్టినవాటిల్లో వందేభారత్ రైళ్లు ఉన్నాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి 160 కిలోమీటర్ల వేగంతో తిప్పుతున్నారు. భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని వందేభారత్ రైళ్లు పూర్తిగా మార్చేశాయి. సొంత సాంకేతికతతో తయారయ్యాయి. ఏ దేశంమీద ఆధారపడలేదు. న్యూఢిల్లీ నుంచి భోపాల్, భోపాల్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న వందేభారత్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలుగా పేరు తెచ్చుకుంది.

వందేభారత్ తర్వాత తేజస్ రెండో స్థానంలో నిలిచింది
దీనితర్వాత స్థానంలో తేజస్ రైలు నిలిచింది. దీన్ని 2017లో ప్రారంభించారు. ముంబయి నుంచి గోవా మధ్య ఉన్న 551 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది. గరిష్టంగా 162 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. న్యూఢిల్లీ-చండీఘడ్, లక్నో-ఆనంద్ విహార్ టెర్మినల్ (న్యూఢిల్లీ) మధ్య సేవలందిస్తున్నాయి. కనిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లల్లో కూడా వందేభారత్ రైళ్లల్లో ఉన్నటువంటి సౌకర్యాలే అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల నుంచి ఛార్జీలు ఎక్కువనే ఫిర్యాదులు వస్తున్నప్పటికీ క్రమంగా వీటికి అలవాటుపడిపోతున్నారు. అయితే సామాన్యుల కోసం వందే సాధారణ్ రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. వీటిల్లో వందేభారత్ తరహాలోనే సౌకర్యాలుంటాయి. కాకపోతే ఇవి నాన్ ఏసీ రైళ్లు. త్వరలోనే ఇవి పెట్టాలెక్కబోతున్నాయి.
భారత్ లో టాప్ 10 ఫాస్టెస్ట్ రైళ్లు
⦿వందే భారత్ ఎక్స్ ప్రెస్- ట్రైన్ 18- 180 కి.మీ/గం
⦿గతిమాన్ ఎక్స్ ప్రెస్- 160 కి.మీ/గం
⦿శతాబ్ది ఎక్స్ ప్రెస్- 150 కి.మీ./గం
⦿ రాజధాని ఎక్స్ ప్రెస్- 140 కి.మీ/ గం
⦿రాజధాని, దురంతో ఎక్స్ ప్రెస్-135 కిమీ/గం
⦿నిజాముద్దీన్ AC సూపర్ ఫాస్ట్-130 కిమీ/గం
⦿అహ్మదాబాద్ AC డబుల్ డెక్కర్-130 కిమీ/గం
⦿యువ ఎక్స్ ప్రెస్- 120- 130 కి.మీ/గం
⦿సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్-110 కిమీ/గం
⦿జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12059), 110 కి.మీ/గం












Click it and Unblock the Notifications