పెళ్ళైనా నర్సింగ్ విద్యార్థినితో ప్రేమాయణం: మత్తు ఇంజక్షన్‌తో సూసైడ్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు: వివాహమైన విషయాన్ని దాచిపెట్టి నర్సింగ్ విద్యార్థినితో అంజి అలియాస్ ఆంజనేయులు అనే వ్యక్తి ప్రేమాయణం సాగించాడు. పెళ్ళి చేసుకోవాలని ఆ యువతి ఒత్తిడి తేవడంతో తనకు అప్పటికే పెళ్ళైన విషయాన్ని బయటపెట్టాడు ఆంజనేయులు. ప్రేమ పేరుతో తాను మోసపోయాయని భావించిన ఆ యువతి మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి రామారావు, కుమారి దంపతుల కుమార్తె హెప్సిబారాణి. చిన్నతనంలోనే హెప్సిబారాణి తల్లిదండ్రులు చనిపోయారు.

కుటుంబ సభ్యుల నిరాదరణ కారణంగా పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన పాస్టర్‌ ఒకరు ఆమెను చేరదీసి తణుకులో నర్సింగ్‌ కోర్సు చదివిస్తున్నారు. విద్యార్థి దశలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నా అనాథగా మిగలకూడదని ఆ ఫాస్టర్ ఆమెను నర్సింగ్‌ కోర్సు చదివిస్తున్నారు.

ప్రేమ పేరుతో మోసం

ప్రేమ పేరుతో మోసం

ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (21) తణుకులోని ఒక ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలలో చదువుతూ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. హెప్సిబారాణి ఆత్మహత్యకు కారణమైన ఆమె ప్రియుడు పిండి ఆంజనేయులు అలియాస్‌ అంజిని పోలీసులు అదుపులో కి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ సీహెచ్‌ రాంబాబు నర్సింగ్‌ కళాశాల వసతి గృహంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించి తోటి విద్యార్థులను విచారించారు. అంజి హెప్సిబారాణిని ప్రేమ పేరుతో మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు.

మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య

మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య

నర్సింగ్ కోర్సు ఆఖరి సంవత్సరం చదువుతూ హెప్సిబారాణి ఇటీవల పరీక్షలు సైతం రాసింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్‌ జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడింది. నర్సింగ్‌ కోర్సు చదువుతున్న హెప్సిబారాణి తణుకులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రియుడు అంజితో కొంతకాలంగా ఘర్షణ పడుతోంది. తనకు ఇంతకుముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన అంజి వ్యవహారంపై స్నేహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలు స్తోంది. పెళ్లైన విషయం తీసుకువస్తే తనకు అప్పటికే పెళ్లయ్యిందనే విషయాన్ని చెప్పడంతో హెప్సిబారాణి మనస్తాపంతో మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంటున్నారు స్నేహితులు.

హెప్సిబారాణి సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

హెప్సిబారాణి సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

‘కేవలం నీవల్లే నా జీవితం ఇలా అయిందనీ.. నేను నిన్ను ప్రేమించి జీవితంలో పెద్ద తప్పు చేశానని.. ఇకపై ఎవరినీ ఇలా మోసం చేయవద్దని' సూసైడ్‌నోట్‌లో ప్రియుడు అంజినుద్దేశించి ఆమె రాసింది.. ‘నాలాంటి అనాథలను ఉన్నత స్థానం కల్పించి ప్రేమగా ఆదరిస్తున్న పాస్టర్‌కు ఐ లవ్యూ' అంటూ ప్రేమను వ్యక్తపరిచింది. తనలా ఎవరూ మోసపోవద్దని తన స్నేహితులకు ఆమె సలహా ఇచ్చింది.

పరువు కోసం సూసైడ్

పరువు కోసం సూసైడ్

అంజి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాల్లో ఉంటుండగా నాలుగు రోజుల క్రితమే స్వదేశానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తనకు కడుపు నొప్పిగా ఉందని ఇంజెక్షన్‌ చేయాలని స్నేహితులను కోరింది. అయితే ఆమె తీసుకువచ్చిన ఇంజెక్షన్‌ అనుమానాస్పదంగా ఉండటంతో వారు నిరాకరించారు. ‘నన్ను పెంచి పోషిస్తున్న పాస్టర్‌ పరువు కోసమే చనిపోతున్నాను.. నేను ఎన్నో కలలు కన్నాను.. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని.. అయితే నా కలలన్నీ కల్లలు చేశావని అంజినుద్దేశించి సూసైడ్ లేఖలో ఆమె రాసిందని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nursing final year student suicide on Sunday at Arjunudu Palem village in West Godavari district.Police said that Nursing student Hepsiba Rani cheated by lover

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి