వైఎస్ షర్మిల, విజయమ్మ, సునీతారెడ్డిపై అసభ్యపోస్టులు, ఫేక్ అకౌంట్లు: విశాఖ రియల్టర్ అరెస్ట్!!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ సునీత రెడ్డిలపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకరమైన పదజాలంతో పోస్టల్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఫేస్బుక్ అందించిన డేటా ఆధారంగా నిందితుడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడానికి ఉపయోగించిన ఐపి అడ్రస్ ను ట్రాక్ చేసి నిందితుడిని పట్టుకున్నారు.
వైయస్ షర్మిల, వైయస్ సునీత రెడ్డిపై అసభ్య పోస్టులు పెట్టిన నిందితుడు విశాఖకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ గా గుర్తించారు. ఇతను విశాఖపట్నం మహారాణిపేట నౌరోజీ రోడ్డుకు చెందిన ఒక రియల్టర్ అ,ని జనవరి 13వ తేదీన వీ రవీంద్ర రెడ్డి పేరుతో ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రవీంద్రారెడ్డి ఫోటోను ఆ అకౌంట్ కు డిపిగా పెట్టాడు.

వైయస్ షర్మిల రెడ్డి, సునీత రెడ్డి, వైఎస్ విజయమ్మలపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారని పోలీసులు గుర్తించారు. ఇక తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతా రెడ్డిపై అసభ్య పోస్టులు పెట్టటంపై రవీంద్రా రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో 45/24 క్రైం నెంబర్ తో కేసు నమోదు చేశారు.
రవీంద్రారెడ్డి వైసీపీ సోషల్ మీడియా సభ్యుడిగా ఉంటూ పార్టీకి సంబంధించిన పోస్టులు చేస్తూ ఉంటారు. ఇటీవల జగన్ కు షర్మిలకు మధ్య ఏపీ రాజకీయాల నేపధ్యంలో సాగుతున్న వార్ పీక్స్ కు చేరుకుంటున్న క్షణంలో రవీంద్రా రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు వైరల్ కావటం, సునీత హైదరాబాద్ లో ఈ మేరకు ఫిర్యాదు చేయటం జరిగాయి.
ఇక రవీంద్రా రెడ్డిని టార్గెట్ చేసిన క్రమంలోనే ఉదయ్ భూషణ్ ఈ పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. తమ పార్టీ వాళ్ళతోనే రవీంద్రారెడ్డి ని తిట్టించాలన్న ఉద్దేశంతోనే నిందితుడు ఉదయ్ భూషణ్ ఈ పని చేసినట్టు ఏఎస్పీ సుధాకర్ వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన క్రమంలో ఏఎస్పీ ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications