15 రైళ్లు రద్దుచేసిన దక్షిణమధ్య రైల్వే
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దాదాపు 280మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఆ మార్గంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో బహనాగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదం తర్వాత యుద్ధప్రాతిపదికన చేపట్టిన పునరుద్ధరణ పనులతో ఇప్పటికే కొన్ని సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే హౌరా వైపు రాకపోకలు సాగించే రైళ్లను రద్దుచేశారు. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేశారు. ఈ నెల 12న చెన్నై సెంట్రల్ -షాలిమార్ (12842)రైలు సర్వీసు సేవలను పునరుద్ధరిస్తున్నారు. .
రద్దైన రైళ్ల జాబితా
11వ తేదీన మైసూరు- హౌరా (22818)
12వ తేదీన హైదరాబాద్-షాలిమార్ (18046); ఎర్నాకుళం-హౌరా (22878), సంత్రగాచి-తంబ్రం(22841), హౌరాడా-చెన్నై సెంట్రల్ (12839)
13వ తేదీన సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807), హౌరా- ఎఎంవీటీ బెంగళూరు(22887), షాలిమార్-చెన్నై సెంట్రల్ (22825), షాలిమార్-హైదరాబాద్(18045), సికింద్రాబాద్-షాలిమార్(12774), హైదరాబాద్-షాలిమార్ (18046), విల్లుపురం-ఖరగ్‌పూర్(22604)
14వ తేదీన ఎస్ఎంవీటీ బెంగళూరు-హౌరా (22864), భాగల్పూర్ -ఎస్‌ఎంవీటీ బెంగళూరు(12254), షాలిమార్-సికింద్రాబాద్ (12773)

రైళ్లు నడవడంలో ప్రధానంగా ఉండే వ్యవస్థలపై రెండేసి తాళాలు వేసి భద్రపరుచుకోవాలని రైల్వేబోర్డు ఆదేశాలు జారీచేసింది. రైళ్ల నియంత్రణ వ్యవస్థలు ఉండే రిలేరూంలు, లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద సిగ్నలింగ్-టెలికమ్యూనికేషన్ల పరికరాలను ఉంచే 'రిలే హట్'లు, పాయింట్/ ట్రాక్ సర్క్యూట్ సిగ్నళ్ల వద్ద సాధ్యమైనంత అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది.












Click it and Unblock the Notifications