జర్మనీ నుంచి వచ్చి.. నిషిత్ 'డెత్ స్పాట్'ను పరిశీలించిన బెంజ్ ప్రతినిధులు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడి తనయుడు నిషిత్ నారాయణ దుర్మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మెర్సిడెజ్ బెంజ్ లాంటి అత్యాధునిక ప్రమాణాలున్న కారులో.. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్లు పగిలిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమైనా లోపలున్నాయా? లేక ఓవర్ స్పీడు వల్లే ఎయిర్ బెలూన్లు పగిలిపోయాయా? అన్న అనుమానాన్ని లేవనెత్తుతూ పోలీసులు.. బెంజ్ కంపెనీకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో లేఖపై స్పందించిన బెంజ్ యాజమాన్యం.. పలువురు ప్రతినిధులను హైదరాబాద్ పంపించింది.

హైదరాబాద్ చేరుకున్న ప్రతినిధులు..

హైదరాబాద్ చేరుకున్న ప్రతినిధులు..

నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని స్థలాన్ని పరిశీలించారు. కారు అంతలా ఎంతలా ఎలా దెబ్బతిందన్న విషయాన్ని పరిశీలించేందుకు రెండు రోజుల క్రితమే వారు జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చారు.

గురువారం ఉదయం

గురువారం ఉదయం

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని 9వ నంబర్ పిల్లర్ వద్దకు వచ్చిన బెంజ్ అధికారులు.. అక్కడి మూలమలుపును, సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ప్రమాద ఘటనను పరిశీలించారు. అనంతరంబోయిన్ పల్లిలోని బెంజ్ షోరూంలో ఉన్న నిషిత్ కారు పరిశీలించి.. ప్రమాద సమయంలో దాని కండిషన్ ను అంచనా వేసే ప్రయత్నం చేశారు.

నిషిత్ మరణంతో

నిషిత్ మరణంతో

ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి.. చురుగ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో అతను ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఎదిగొచ్చిన కొడుకు దూరమయ్యారన్న బాధ మంత్రి నారాయణను వెంటాడుతోంది.

నిషిత్ నారాయణ మరణం

నిషిత్ నారాయణ మరణం

ఆయన కుటుంబాన్నే కాక, నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కూడా విషాదంలో ముంచెత్తింది. ఆయన అంత్యక్రియల రోజు విద్యా సంస్థల ఉద్యోగులంతా నెల్లూరుకు తరలివచ్చారు. పెన్నా నది ఒడ్డున నిషిత్ నారాయణ అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రస్తుతం మంత్రి నారాయణ కొడుకు చనిపోయిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Officials of mercidez benz are visited the spot where nishit narayana was died in Jublihills.They noted some details on that incident
Please Wait while comments are loading...