గొంతు కోసి గుడిపూడిలో వృద్ధ దంపతుల హత్య

అమరావతి: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గుడిపూడిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు వృద్ధదంపతులను గొంతుకోసి హత్యచేశారు. మృతులు రామారావు, వెంకాయమ్మలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

వేగంగా వెళ్తున్న వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Old couple murdered in gudipudi, guntur district

నల్లగొండ జిల్లా నుంచి టాటా ఏస్ వాహనం కైకరం గ్రామ శివారుకి చేరుకోగానే రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+