జగన్ కు చంద్రబాబు, పవన్ దొరికిపోయారా ? కొత్త మైండ్ గేమ్ స్టార్ట్ ! అసలు టార్గెట్ ఇదేనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేబినెట్ ప్రక్షాళనతో పాటు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాల్ని చేపట్టిన వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లే కనిపించారు. దీంతో అప్రమత్తమైన విపక్షాలు టీడీపీ, జనసేన ఉమ్మడి వ్యూహం రచించే పనిలో పడ్డాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకతాటిపైకి తెస్తానని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. అయితే దీనికి కౌంటర్ గా పొత్తుల్లేకుండా మీరు పోటీ చేయలేరా అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ మళ్లీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.

చంద్రబాబు-పవన్ పొత్తు వ్యూహం
ఏపీలో మూడేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే నష్టపోతామని గ్రహించాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఎవరెలా నష్టపోతారో గత ఎన్నికల ఫలితాలు వారికి రుచి చూపించాయి. దీంతో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి పోటీ వ్యూహానికి తెరలేపారు. పొత్తలు పెట్టుకుని బరిలోకి దిగుతామని సంకేతాలు ఇచ్చేశారు. అప్పటికే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇవ్వడంతో వీరిద్దరూ పొత్తులపై బహిరంగ ప్రకటనలు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఇప్పుడే వీరిద్దరి మధ్య పొత్తు కుదుతుతుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.

వైసీపీ ఎదురుదాడితో సీన్ రివర్స్
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు-పవన్ పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. తమకు వ్యతిరేకంగా విపక్షాలు పొత్తులతో ముందుకెళితే నష్టం తప్పదని గ్రహించింది. అయితే ఆ నష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకునేందుకు వీలుగా ఎదురుదాడి మొదలుపెట్టింది. పొత్తులు లేకుండా పోటీ చేయలేరా అంటూ చంద్రబాబు, పవన్ ను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దీంతో ఇద్దరూ ఆత్మరక్షణలో పడ్డారు. మరోవిధంగా చెప్పాలంటే జగన్ కు వీరిద్దరూ ఈ విషయంలో దొరికిపోయినట్లయింది. అంతే మరో ట్విస్ట్ మొదలైంది.

చంద్రబాబు-పవన్ కొత్త మైండ్ గేమ్ ?
అప్పటివరకూ తామిద్దరూ పొత్తులపై ముందస్తుగానే ప్రకటన చేసేస్తే ఇద్దరికీ ఉపయోగం ఉంటుందని భావించిన చంద్రబాబు-పవన్ వైసీపీ ఎదురుదాడితో షాక్ అయ్యారు. ఎప్పుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పొత్తులు పెట్టుకుంటామని చెప్పుకుని తిరిగితే ప్రయోజనం లేదని ఇద్దరికీ అర్దమైంది. దీంతో మరో కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎవరికి వారు ప్రభుత్వంపై విడివిడిగానే ఎదురుదాడి చేస్తూ ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఎక్కడా పవన్ చంద్రబాబు పేరు కానీ, టీడీపీ పేరు కానీ ఎత్తకుండా.. అలాగే చంద్రబాబు కూడా పవన్ , జనసేన, పొత్తుల పేరెత్తకుండానే ముందుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కాదు ఇరు పార్టీల నేతలు కూడా పాతమిత్రుల గురించి మాట్లాడకుండా సొంత వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. సరైన సమయంలో పొత్తులపై ప్రకటనలు చేస్తామని ఇరుపార్టీలూ చెప్తున్నాయి.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications