వెన్నెల రాత్రుల్లో, నదీ అలలపై .. మధురమైన బోట్ షికారు..ఏపీ టూరిజం శుభవార్త!
వెన్నెల రాత్రుల్లో ప్రశాంతమైన నది అలలపైన తేలియాడుతూ ఫ్యామిలీతో కలిసి బోట్ షికారు చేయాలని ఎవరికి మాత్రం అనిపించదు. ఆ మధురమైన అనుభూతిని పదిలపరుచుకోవాలని ఫీల్ కాని వారు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు అని చెప్పాలి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో అలసి సొలసి సేద తీరాలి అని భావించే వారికి మధురమైన అనుభూతులను మూటగట్టుకునేలా అద్భుతమైన పర్యాటక ఏర్పాట్లను చేయడానికి ఏపీ టూరిజం రెడీ అయింది.
కేరళ అలెప్పీ తరహాలో పర్యాటక బోట్లు
కేరళలోని అలెప్పి లో బోటు షికారు తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నదులు, నది తీర ప్రాంతాలలో సకల సౌకర్యాలతో పర్యాటక బోట్లను సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ రంగంలో ఈ పర్యాటక బోట్లకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగానికి నూతన ఉత్సాహం తీసుకురావడానికి ఏపీ టూరిజం చేస్తున్న ఈ ప్రయత్నం ఏపీలో పర్యటక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

బోట్లను తిప్పటం కోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ ల ఆహ్వానం
కృష్ణ, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధారతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 నదులు ఉన్నాయి. ఈ నదులలో బోట్లు తిప్పడం కోసం ముందుకు వచ్చే వారి కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ లను ఆహ్వానించింది. ప్రస్తుతం ఇందులో భాగంగా ఐదు చోట్ల, అన్ని సదుపాయాలతో బోట్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోనసీమ జిల్లా దిండిలో రెండు బోట్లను ప్రారంభించింది.
పలు ప్యాకేజీలతో బోట్లలో వసతులు
గోదావరి వశిష్ట పాయలో పగటి వేళల్లో బోట్లు తిప్పుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత హరిత రిసార్ట్ వద్ద నిలిపివేసి రాత్రిపూట బస చేయడానికి కేవలం ఒక బోటును వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్తగా ప్రవేశపెట్టే బోట్లలో కొన్నింటిని రాత్రి కూడా నడపాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆ బోట్లలో ఉండడానికి గదులు, రెస్టారెంట్, వినోద కార్యక్రమాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తగినట్టు పలు ప్యాకేజీలు రూపొందిస్తున్నారు.
కొత్త బోట్లను ఏర్పాటు చేస్తున్న పర్యాటక ప్రాంతాలు ఇవే
ఇక విజయవాడ భవానీ ద్వీపం నుంచి కృష్ణ గోదావరి పవిత్ర సంగమం వరకు కొత్తగా మరో బోటును నడపనున్నారు. పాపికొండలుకు వెళ్లే పర్యాటకులు ఒకటి రెండు రోజులపాటు బోట్లోనే ఉండేలాగా కొత్త బోట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక కోనసీమ జిల్లాలో సముద్ర తీర ప్రాంత అంతర్వేది నుంచి ఒక బోట్ ను నడపనున్నారు. పర్యాటకులు పగలు రాత్రి అందులోనే ఉండేలా ప్యాకేజీలను రూపొందించనున్నారు.
రాత్రి విడిది చేసేలా బోటులో ఏర్పాట్లు
వైయస్సార్ జిల్లాలో గండికోట అందాలను తిలకించేలా ఏర్పాటు చేసిన బోటు రాత్రి విడిది కూడా సౌకర్యవంతంగా ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని తాజంగి జలాశయంలో కూడా బోటు నడపనున్నారు. లంబసింగి సందర్శనకు వచ్చే వారంతా తాజాగా జలాశయాన్ని సందర్శిస్తున్న క్రమంలో అక్కడ బోటును నడపనున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications