పవన్ కల్యాణ్‌పై మరో "కత్తి" దూశాడు: చంద్రబాబు భిక్ష వేసే సీట్లలోనే....

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ విమార్శనాస్త్రాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మీడియా సమక్షంలో ఆయన పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం.

తమిళనాట రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన సందర్భంగా...పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు.. అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను కత్తి మహేశ్ పవన్‌కు ఆపాదించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు కత్తిని ప్రశ్నించారు.

మరోసారి మహేష్...కత్తి దూశాడు...

మరోసారి మహేష్...కత్తి దూశాడు...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సినీ విమర్శకుడు మహేష్ కత్తి తన సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టి పోటీ చేయ్యకుండా ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు అని రజనీకాంత్ పేర్కొన్నారని, మా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అంటామే అని ఆయన ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో...మీడియా...

ఈ నేపథ్యంలో...మీడియా...

కత్తి మహేష్ చేసిన ఈ వ్యాఖ్య పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. మరోవైపు పవన్ ను ఉద్దేశించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు వివరణ అడిగారు. పవన్ 2019 లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు కధా...మరి రజనీకాంత్ వ్యాఖ్యలు ఆయనకు ఎలా వర్తిస్తాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

ఎన్ని స్థానాల్లో చేస్తారు...

ఎన్ని స్థానాల్లో చేస్తారు...

2019 లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు గుర్తుచేయడంపై స్పందించిన కత్తి మహేశ్.. మరోసారి తనదైన శైలిలో సమాధానమిచ్చారు...చేస్తారు...వచ్చే ఎన్నికల్లో ఆయన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు?...చంద్రబాబు నాయుడు భిక్షగా వేసిన స్థానాల్లో పోటీ చేస్తారు...అని వ్యాఖ్యానించారు.

మరోవైపు చంద్రబాబు పైనా...

మరోవైపు చంద్రబాబు పైనా...

తనకు ఒటు వెయ్యకుంటే తరువాత వారు సిగ్గుపడతారు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను కత్తి మహేష్ తిప్పికొట్టారు. చంద్రబాబు వ్యాఖ్యల క్లిప్పింగును మహేష్ కత్తి తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ చేస్తూ...వేసి సిగ్గుపడుతున్నారు... అనే కామెంట్ పోస్ట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
media representatives asked film critic katti Mahesh about Pawan Kalyan's comments about 2019 elections....for that katti Mahesh replied in his own style ... ... how many seats will he contest in the next election? ... pawan kalayan will contest in the seats those given by chandrababunaidu as donation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి