• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ వార్తల్లోకి చంద్రబాబు "ఐక్యరాజ్యసమితి ప్రసంగం"...ఆ జాబితాలో లేదంటున్న ఎంపి జివిఎల్

|

అమరావతి:ఎపి సిఎం చంద్రబాబు నాయుడు "ఐక్యరాజ్య సమితి ప్రసంగంపై బిజెపి ఎంపి జివిఎల్ మరోసారి ప్రశ్నాస్త్రాలు సంధించారు. సిఎంవో ప్రకటించిన విధంగా ఐక్యరాజ్య సమితిలో 24 న జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు ప్రసంగం నమోదు కాలేదేమిటని జివిఎల్ ప్రశ్నిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి అఫీషియల్ వెబ్ సైట్ లోని ఈవెంట్ల జాబితాలో చంద్రబాబు ప్రసంగం లేదని...కావాలంటే వెతుక్కొని చూడొచ్చని ఎంపి జివిఎల్ అంటున్నారు.ఇంతకీ మన గ్లోబల్ లీడర్ ఎప్పుడు ఏ సదస్సులో మాట్లాడుతున్నారో చెప్పాలని చంద్రబాబు నుద్దేశించి వ్యంగాస్త్రాలు సంధించారు. దీంతో చంద్రబాబు ఐక్యరాజ సమితి ప్రసంగంపై వివాదం మళ్లీ వార్తల్లోకెక్కింది.

ఎంపి జివిఎల్...ఇటీవలి సవాల్

ఎంపి జివిఎల్...ఇటీవలి సవాల్

చంద్రబాబు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే క్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమన్నారంటే..."చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి...చెప్పేదొకటి...ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో...చంద్రబాబు విమానం ఎక్కే లోపే వాళ్లు పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలి"...అని ఎంపి జివిఎల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ...ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎంపి జివిఎల్ ఆరోపించగా దీనిపై ఎపి సిఎంవో వెంటనే ప్రతిస్పందించింది.

వెంటనే...స్పందించిన సిఎంవో

వెంటనే...స్పందించిన సిఎంవో

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వాన పత్రికను మీడియాకు విడుదల చేసింది. గత నెల 22న యుఎన్ వో ఈ ఆహ్వాన పత్రిక పంపినట్లు ఎపి సిఎంవో వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్ పేరుతో ఎపి సీఎంకు ఈ ఆహ్వానం అందినట్లు తెలిపింది. ఎపి సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయంపై ప్రశంసలు కురిపించిన యుఎన్వో ఆయన స్ఫూర్తితో చాలామంది ఆ వైపు మళ్లుతారని ఆహ్వాన లేఖలో పేర్కొనడం జరిగింది.

మరోసారి...అదే అంశంపై ప్రశ్నలు

మరోసారి...అదే అంశంపై ప్రశ్నలు

దీంతో ఐక్యరాజ్యసమితి ప్రసంగానికి సంబంధించి సిఎం చంద్రబాబుపై బిజెపి ఎంపి జివిఎల్ నిరాధార ఆరోపణలు చేసినట్లు భావించే పరిస్థితి ఏర్పడింది.

అయితే ఇదే విషయంపై మళ్లీ బిజెపి ఎంపి జివిఎల్ ట్విట్టర్ లో తాజాగా ప్రశ్నాస్త్రాలు సంధించడంతో ఈ అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. యునైటెడ్ నేషన్స్ జనరల్‌ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశాల సందర్భంగా ఐరాస అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ఓ సదస్సులో వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించబోతున్నారంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఊదరగొడుతోందని, వాళ్లు తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నిలదీశారు.

ఆ జాబితాలో...ఎక్కడా లేదే?

ఆ జాబితాలో...ఎక్కడా లేదే?

ఐక్యరాజ్యసమితి సార్వత్రిక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న 313 అనుబంధ ఈవెంట్లలో చంద్రబాబు ప్రసంగించబోయే ఈవెంట్‌ లేదని, చంద్రబాబు ప్రసంగించబోయే యూఎన్‌ఈపీ ఈవెంట్‌ను యూఎన్‌ఈపీ, బీఎన్‌పీ బరిబాస్‌, వరల్డ్‌ ఆగ్రోఫారెస్ట్రీ నిర్వహిస్తాయని పేర్కొన్నప్పటికీ...ఐరాస అనుబంధ ఈవెంట్స్‌ జాబితాలో ఇది నమోదు కాలేదని ఎంపి జివిఎల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఒకవేళ నమోదయిఉంటే టీడీపీ వాళ్లు ఆ లింక్‌ను తనకు షేర్‌ చేయాలని కోరారు.

గ్లోబల్ లీడర్ ఎక్కడ?...ఎక్కడని ఎద్దేవా!

గ్లోబల్ లీడర్ ఎక్కడ?...ఎక్కడని ఎద్దేవా!

ఈ నెల 24న ‘సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురువుతున్న సవాళ్లు' అనే అంశంపై యూఎన్‌ఈపీ ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసమే నంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అయితే, సదరు సదస్సు గురించి ఐరాస్‌ వెబ్‌సైట్‌లో నమోదైన 313 ఈవెంట్లలో ఎక్కడా నమోదై లేదని, కావాలంటే వెతుక్కొని చూడవచ్చునని ఎంపి జివిఎల్ అంటున్నారు. ఇంతకు ‘మన గ్లోబల్‌ లీడర్‌' చంద్రబాబు ఏ సదస్సులో మాట్లాడుతున్నారని ఎంపి జీవీఎల్‌ నిలదీశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi:BJP MP GVL once again questioned about AP CM Chandrababu Naidu's United Nations Speech. MP GVL stated that CM Chandrababu's speech has not been recorded in the list United Nations events as AP CMO announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more