తిరుపతిలో కుప్పకూలిన టీటీడీ ఆర్చి-రెండు కార్లు ధ్వంసం-ఒకరికి గాయాలు..?
తిరుపతిలో అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం(ఆర్చి) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బస్టాండ్ ప్రాంతం నుంచి రామానుజ సర్కిల్‌కు వెళ్లే మార్గంలో రిలయన్స్ మార్ట్ వద్ద ఈ ఆర్చిని ఏర్పాటు చేశారు. ఇటీవల టీటీడీ అధికారులు అక్కడ గరుడ వారధి నిర్మాణ పనులు చేపట్టారు. ఆ సమయంలో ఆర్చి పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఆదివారం ఓ లారీ ఆ మార్గంలో వెళ్తుండగా... దాని పైభాగం ఆర్చిని తాకడంతో అది కుప్పకూలిపోయింది. అదే సమయంలో ఆర్చి కింద నుంచి ప్రయాణిస్తున్న ఓ కారు... దాని కింద ఇరుక్కుపోయింది.
అయితే అదృష్టవవాత్తు ఆర్చి కారు ముందు భాగంపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే వెనుక భాగంపై పడి ఉంటే అందులో ఉన్నవారికి గాయాలై ఉండేవి. ప్రమాదంలో మరో కారు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

శ్రీశైలం ఆలయం వద్ద భక్తుడు మృతి :
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైల మల్లన్న దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు.. గుండెపోటుతో మృతి చెందాడు. స్వామి దర్శనం తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుతో అతను కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Recommended Video
గుండెపోటు కారణంగానే అశోక్ మృతిచెందినట్లు తెలిపారు.మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన అశోక్ వల్లికగా పోలీసులు గుర్తించారు.అనంతరం అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications