కుట్ర జరిగిందా?: మళ్లీ పిడికిలి బిగించిన గరగపర్రు, 'యాకోబ్' మృతిపై అనుమానాలు

Subscribe to Oneindia Telugu

భీమవరం: ధిక్కరించినందుకే ఆధిపత్యం మరోసారి బుసకొట్టిందా?.. రూటు మార్చి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువై కబళించిందా?.. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు సాంఘీక బహిష్కరణను నిరసిస్తూ.. అన్నిశక్తులను ఏకం చేసి ఉద్యమం నడిపించిన యాకోబు దుర్మరణం వెనుక దళిత సంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి.

జగన్, పవన్‌కు వాళ్ల బాధ కనిపించదా?: గరగపర్రు వెలివేతపై మౌనమెందుకు?..

గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్న యాకోబు శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలామందిలో అనుమానాలు రేకెత్తించింది. పాలకోడేరు వద్ద ఓ లారీ ఆయన్ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరోసారి ఏకమైన దళిత సంఘాలు:

మరోసారి ఏకమైన దళిత సంఘాలు:

యాకోబు దుర్మరణంతో మరోసారి ఏకమైన దళిత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు యాకోబు మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. యాకోబు మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన ఆసుపత్రి ఎదుట వీరంతా ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు ఆదివారం ఉదయం శవపంచనామాకు అధికారులు సిద్దమవ్వగా దళిత సంఘాలు అడ్డుకున్నాయి. యాకోబు మృతిపై అనేక అనుమానాలున్నాయని, సాంఘిక బహిష్కరణపై నియమించిన కమిటీని నిలదీసినందుకే కుట్ర జరిగిందని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. ఇది కచ్చితంగా అగ్రవర్ణ పెత్తందారుల కుట్రేనని ఆరోపిస్తున్నారు. లారీతో ఢీకొట్టించి హత్య చేయించారని, ఆపై ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.

West Godavari, Tundurru : Godavari Mega Aqua Food Factory is Good Or Bad ?
నిందితులు విడుదలైన కాసేపటికే:

నిందితులు విడుదలైన కాసేపటికే:

గరగపర్రు సాంఘీక బహిష్కరణలో అరెస్టయిన ముగ్గురు బెయిల్ పై విడుదలైన కొద్దిసేపటికే యాకోబు మృతి చెందడం దళిత సంఘాల అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. దళిత సంఘాల ఆందోళనతో మరోసారి గరగపర్రు అట్టుడికింది. పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. యాకోబు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.

యాకోబు మృతి కేసును హత్య కేసుగా సోమవారం మారుస్తామని పోలీసులు తెలపడంతో దళితులు ఆందోళన విరమించారు. దీంతో ఉద్రిక్తలకు తెరపడింది. పోస్ట్ మార్టమ్ అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో ప్రదర్శనగా తీసుకెళ్లి.. స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుంచి గరగపర్రు తరలించారు.

శవరాజకీయాలు: ఆనందబాబు

శవరాజకీయాలు: ఆనందబాబు

యాకోబు మృతిని హత్య అని ఆరోపించడంపై మంత్రి ఆనందబాబు స్పందించారు. ప్రతిపక్ష పార్టీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. యాకోబు మృతిని, దళిత హత్యగా చిత్రీకరించి నీచరాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ నుంచి భీమవరం వచ్చిన లారీ.. తిరుగు ప్రయాణంలో యాకోబును ఢీకొట్టిందన్నారు. అంతేకానీ దాన్ని కులాలకు అంటగట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు.

ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అని మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. మృతుని కుటుంబానికి ప్రభుత్వం చంద్రన్న బీమా ద్వారా రూ. 5లక్షలు, తెదేపా సభ్యత్వం ద్వారా వచ్చే రూ. 2లక్షలు పరిహారం అదించనున్నట్లు వివరించారు.

గరగపర్రులో భారీగా పోలీసులు:

గరగపర్రులో భారీగా పోలీసులు:

యాకోబు మృతి నేపథ్యంలో గరగపర్రులో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. గొల్లలకోడేరు, గరగపర్రు శివారు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, ఎస్సీ కాలనీకి వెళ్లే రహదారిలోను పోలీసులను మొహరించారు. గుర్తింపు కార్డు చూపిస్తేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ఎస్సీ కాలనీని సందర్శించేందుకు వచ్చిన మానవహక్కుల వేదిక బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was killed and another injured in a road accident near Garagaparru village in Palakoderu mandal on Friday night.According to police,
Please Wait while comments are loading...