మాజీ ఎమ్మెల్యే రమేష్‌కు ఏడాది జైలు, భారీ ఫైన్
హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్ బాబుకు న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతో పాటు కోర్టు ఆయనకు పన్నెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. రమేష్ గతంలో మైలవరం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.
రమేష్ బాబు 2010లో శ్రీకాంత్ అనే వ్యాపారి నుండి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. 2012లో అతను వ్యాపారికి చెక్కు ఇచ్చారు. ఇది చెల్లక పోవడంతో విజయవాడ రెండో సెషన్స్ కోర్టు విచారణ జరిపి.. జైలు శిక్ష, జరిమానా విధించింది.

తాటిచెట్టుపై నుంచి పడి యువకుడు మృతి
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యానవలసలో ఓ యువకుడు తాటిచెట్టుపై నుంచి జారి పడి మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది.
నడిరోడ్డుపై మాజీ రౌడీ షీటర్ హత్య
నడిరోడ్డుపై మాజీ రౌడీషీటర్ రామకృష్ణ (55) హత్యకు గురయ్యాడు. దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. ఒకప్పుడు పేరుమోసిన రౌడీగా రామకృష్ణ గుర్తింపుపడ్డాడు. రానురాను అతని వ్యవహార శైలిలో మార్పురావడంతో పోలీసులు అతనిపై రౌడీషీట్ ఎత్తి వేశారు. అయినా కొద్ది కాలంగా సెటిల్‌మెంట్లలో కింగ్‌గా పేరొందారు.












Click it and Unblock the Notifications