ఏపీ ప్రజలకు అలర్ట్.. సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయడం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 10వ తేదీ (మంగళవారం) రాత్రి వరకు సేవలను నిలిపివేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సాంకేతిక మార్పుల కారణంగా..

ప్రభుత్వం AP Seva Portal ను ప్రస్తుతం Microsoft Cloud నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్‌కు (State Data Centre - SDC) మైగ్రేట్ చేస్తోంది. ఈ డేటా మార్పిడి ప్రక్రియ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కొన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు అని అధికారులు వెల్లడించారు.

online-services-in-secretariats-at-andhra-pradesh-closed

తాత్కాలికంగా నిలిచే ముఖ్యమైన సేవలు ఏవంటే..?

ఆదాయ ధ్రువీకరణ పత్రం

సమగ్ర ధ్రువీకరణ పత్రం (Integrated Certificate)

భూమి మ్యుటేషన్లు (Land Mutations)

ఇళ్ల స్థలాల దరఖాస్తులు / పట్టాలు

వృద్ధాప్య ధ్రువీకరణ పత్రం

వివాహ ధ్రువీకరణ పత్రం

రేషన్ కార్డు సంబంధిత సేవలు

రెవెన్యూ శాఖ సేవలు (జమాబందీ, పట్టాదారు పాస్‌బుక్ తదితరాలు)

వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్లు

పట్టణ పరిపాలన శాఖ సేవలు (గ్రీవెన్సులు, లైసెన్సులు, అప్లికేషన్లు మొదలైనవి)

మత్స్య శాఖ సేవలు (ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ లైసెన్సులు/సబ్సిడీలు)

అయితే, ఈ ఆన్‌లైన్ మార్పుల ప్రభావం అన్ని ప్రభుత్వ సేవలపై ఉండదని.. కొన్ని ఇతర సేవలు - ఆధార్ అప్‌డేట్స్, బ్యాంక్ సేవలు, పలు కేంద్ర ప్రభుత్వం స్కీములు, నాన్-రెవెన్యూ ఆధారిత సేవలు వంటి కొన్ని సేవలు మీ సేవా కేంద్రాల్లో యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పనుల కోసం ముందుగానే అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేదా అప్లికేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతరాయం ముగిసిన వెంటనే సేవలు మళ్లీ పూర్వపరిస్థితికి తీసుకువస్తామని వెల్లడించారు. మరింత సమాచారం కోసం https://ap.gov.in/ లేదా గ్రామ సచివాలయం అధికారిక పోర్టల్స్‌ను సందర్శించవచ్చని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+