ఎపిలో నూతన సంవత్సరం వేడుకలు బ్యాన్: ఉగాదే..

Posted By:
Subscribe to Oneindia Telugu
జ‌న‌వ‌రి 1న పూజ‌ల‌కు నో ప‌ర్మిష‌న్‌ ! టీటీడీ తో సహా !

విజయవాడ: ఆలయాల్లో నూతన సంవత్సరం అలంకరణలను, వేడుకలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిషేధించింది. నూతన సంవత్సరం దర్శనాలపై కూడా నిషేధం పెట్టింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ అయింది.

దాంతో 2018 జనవరి 1వ తేదీన ఆలయాల్లో నూతన సంవత్సరం ప్రత్యేకతలు ఏవీ అమలు కావు. ఉగాదిని నూతన సంవత్సరంగా పరిగణించాలని, ఇంగ్లీష్ క్యాలెండర్ల స్థానంలో తెలుగు సంవత్సరాల క్యాలెండర్‌ను పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

 Only Ugadi is New Year day for temples, AP bans January 1 special

ఇంతకు ముందు జనవరి 1వ తేదీన ఆలయాల్లో పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇక అవి జరగవు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ క్యాలెండర్‌ను పాటిస్తూ వస్తున్నారని దేవాదాయ సాఖ హిందు ధర్మ ప్రచార ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అన్నారు

నూతన సంవత్సర వేడుకలు హిందూ వైదిక సంస్కృతి కాదని అన్నారు. నూతన సంవత్సరాదిన వేలాది మంది భక్తులు వస్తుండడంతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తూ వచ్చారు. ఆ సంప్రదాయానికి అంతం పలకాలని కమిషన్ వైవి అనురాధ అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The APendowment department put out a circular banning New Year darshan and decorations across temples in the state from 2018.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి