Operation Firewall: పాక్ కు గూఢచర్యం-10 రాష్ట్రాల్లో ఏపీ పోలీసుల వేట-విశాఖలో ఇద్దరు అరెస్టు..!

శత్రుదేశం పాకిస్తాన్ కు దేశ రహస్యాలను చేరవేస్తున్న ఇంటి దొంగలపై ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆపరేషన్ ఫైర్ వాల్ (Operation Firewall) పేరుతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్ లో 18 మందిని అరెస్టు చేశారు. ఇందులో విశాఖలోని తూర్పు నేవీ కమాండ్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. దేశంలోని సైనిక కదలికల్ని వీరు శత్రుదేశానికి చేరవేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?
సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?

అక్టోబర్ 1న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన 12 బృందాలు ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించాయి. విశాఖ కేంద్రంగా దేశ రహస్యాల్ని శత్రుదేశమైన పాకిస్తాన్ కు చేరవేస్తున్న భారీ కుట్రను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ ఫైర్ వాల్ పేరుతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ లో పాకిస్థాన్‍కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బహిర్గతం విచారణలో బహిర్గతమయ్యాయి. 12 ప్రత్యేక బృందాలతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్ సెల్ మెరుపుదాడి చేసి వీరిని పట్టుకుంది.

Operation Firewall AP Counter Intelligence Arrests 2 Navy staff in Espionage Case
సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!
సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!

ఈ కేసులో ప్రాథమికంగా ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో విశాఖపట్నంలో నేవీ అధికారులకు కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్, నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌కు అందించడంతో పాటు, అందుకు సంబంధించి డబ్బులు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో నిందితుడు ప్రదీప్ ముఖర్జీ విశాఖపట్నం నేవల్ బేస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌కు వాట్సాప్ ఖాతా యాక్టివేషన్ కోసం OTP అందించడం, వారితో కమ్యూనికేట్ చేయడం, నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+