జగన్ సక్సెస్ బాటనే నమ్ముకున్న టీడీపీ - మారుతున్న లెక్క..!!

సీఎం జగన్ ను ఓడించాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. కానీ, ఒంటరిగా పోటీ చేయలేరు. సొంత ప్రచార తీరును నమ్ముకోవటం లేదు. సీఎం జగన్ నిర్ణయాల బాటలోనే టీడీపీ అడుగులు వేస్తోంది. వైసీపీ అమలు చేసిన గడప గడపను ఇప్పుడు ఫాలో అవుతోంది. ఇంటింటికి జగన్ స్టిక్కర్స్‌ను తప్పుబట్టిన టీడీపీ ఇప్పుడు ప్రతీ ఇంటికి చంద్రబాబు స్టిక్కర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ సీఎంను ఫాలో అవ్వటం రాజకీయ చర్చగా మారింది.

ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. జగన్ లక్ష్యంగా పొత్తులు, లెక్కలు సిద్దం చేస్తున్న టీడీపీ ప్రజల్లోకి మాత్రం జగన్ బాటనే నమ్ముకుంది. సీఎం జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వ్యూహాత్మకంగా 2024 ఎన్నికలపైన ఫోకస్ చేసారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆయన విశ్వసనీయతను దెబ్బ తీయటంలో సక్సెస్ అయ్యారు.

Chandrababu Naidu Follows Jagan

తాను తన తండ్రి తరహాలో మాట ఇస్తే అమలు చేస్తాననే నమ్మకం పెంచుకొనేందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 2.34 లక్షల మేర లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చారు. తన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో ఉన్నారు.

జగన్ ను ఒంటరిగా ఓడించలేమని గుర్తించిన టీడీపీ, జనసేనలు జత కట్టటం ఖాయమైంది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పైన విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు అదే సంక్షేమాన్ని తమ ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది. జగన్ తన పథకాలను మహిళలే ప్రధాన లబ్దిదారులుగా అమలు చేస్తున్నారు.

Chandrababu Naidu Follows Jagan

దీంతో, జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే మహిళలను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్ అమలు చేస్తున్న పథకాలు, మహిళా ఓట్ బ్యాంక్ లక్ష్యంగా మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను, ఇప్పటికే తాము అమలు చేస్తున్న పథకాల మేనిఫెస్టో టీడీపీ ప్రకటించిందని వైసీపీ విమర్శలు చేసింది.

తమ మేనిఫెస్టోను నేతల ద్వారా ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించ లేదు. దీంతో, ఇప్పుడు అవే పథకాలను జగన్ గత ఏడాదిన్నర కాలంగా అమలు చేస్తున్న విధానం తరహాలో ప్రతీ ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయింది. వైసీపీ తీసుకొచ్చిన గృహ సారథులకు పోటీగా కుటుంబ సారధులను రంగంలోకి దించుతోంది. వైసీపీ అమలు చేసిన గడప గపడకు ప్రభుత్వం తరహాలో ప్రతీ ఇంటికి టీడీపీ నేతలను 45 రోజులు పంపాలని నిర్ణయించారు.

Chandrababu Naidu Follows Jagan

ప్రతీ ఇంటికి జగన్ హయాంలో జరిగిన మేలు పైన లేఖలను వైసీపీ నేతలు ఇంటింటికి అందించారు. ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటా ఎంత మేలు జరుగుతుందనేది బాండ్ ద్వారా ఇచ్చేందుకు టీడీపీ సిద్దమైంది. గతంలో జగన్ స్టిక్కర్లను విమర్శించిన టీడీపీ, ఇప్పుడు చంద్రబాబు స్టిక్కర్ల పంపిణీకి రెడీ అయింది. ఇలా, పథకాలు..ప్రచారం విషయంలో జగన్ రూట్ లోనే టీడీపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మరి..ఎన్నికల వేళ ఇది కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+