అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యా వ్యవస్థలో సీఎం జగన్ మార్క్ : సంస్కరణలు - సదుపాయాలు : రూ 16 వేల కోట్ల ఖర్చుతో..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. విద్యా వ్యవస్థలో "నాడు" - "నేడు" అనే విధంగా మార్పు వచ్చింది. గతంలో కార్పోరేట్ విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తే..ఇప్పుడు విద్య ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. కార్పోరేట్ విద్యతో పాటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా సదుపాయాలను అందిస్తున్నారు.

విద్యకు ప్రోత్సహం ఇచ్చేందుకు పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61,661 ప్రభుత్వ విద్యా సంస్థల రూపు రేఖలు మార్చటమే లక్ష్యంగా మొత్తం రూ.16,450.69 కోట్లకు ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో తొలిదశ పూర్తి చేసారు. పాత భవనాల్లో..ఎప్పుడు కూలిపోతాయో తెలియని విధంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు ఇప్పుడు మారిపోయాయి.

కార్పోరేట్ సంస్థలతో పోటీ పడేలా

కార్పోరేట్ సంస్థలతో పోటీ పడేలా

ప్రయివేటు విద్యా సంస్థ తరహాలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ బ్లాక్‌బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, డ్రింకింగ్‌ వాటర్, కాంపౌండ్‌వాల్‌ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారుతల్లిదండ్రులతో ఏర్పడిన విద్యా కమిటీల భాగస్వామ్యంతో పర్యవేక్షణా కమిటీలు ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా అందిస్తున్న డబ్బు నుంచి టాయిలెట్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌కు వేయి రూపాయల చొప్పున జమచేస్తున్నారు.

సౌకర్యాలను, సదుపాయాలను కల్పించుకోవటంతో పాటుగా వాటిని సమర్ధవంతంగా నిర్వహించుకొనేందుకు ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో టాయిలెట్లు లేని కారణంగా ఎంతో మంది ఆడపిల్లలు బడి మానేసే పరిస్థితిలోనూ మార్పు వచ్చింది.

సంస్కరణలు - సదుపాయాలు


స్కూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎప్పుడు ఏ మరమ్మత్తుగా వచ్చినా వెంటనే బాగుచేసేందుకు వీలుగా స్కూలు మెయింటినెన్స్‌ నిధిని కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిధిని పాఠశాల పరిధిలోనే ఏర్పాటు చేసారు. పేదలకు ఇంగ్లీషు మీడియం విద్యా బోధన దూరం కాకూడదనే ఉద్దేశంతో రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా.. న్యాయ పరంగా చిక్కులు ఎదురైనా సీఎం జగన్ వెనక్కు తగ్గలేదు.

అదే సమయంలో విద్య కేవలం పట్టాలు అందుకోవటానికి కాదు..వారికి జీవితం ఇవ్వటానికి అనే విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు సైతం పోటీ పడేలా మార్పులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దుల కోసం సీఎం జగన్ విద్యా కానుక పథకం తీసుకొచ్చారు. ఇందులో 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020-21లో రూ.648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021-22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది.

విద్యా ఖర్చులు - ఆర్దిక తోడ్పాటు

విద్యా ఖర్చులు - ఆర్దిక తోడ్పాటు

మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీ ఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా మన పిల్లలను తయారుచేసేందుకు ఇంగ్లిషు మీడియంలోనే బోధన ప్రారంభించారు. పిల్లలు అర్థంచేసుకునేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించారు.

స్కూళ్లన్నింటినీ కూడా సీబీఎస్‌ఈకు అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు 2025 నాటికి సీబీఎస్‌ఈలో పరీక్షలు రాస్తారు. వీరిని మరింత సుశిక్షితులుగా తయారుచేయడానికి వీలుగా బైజూస్‌తో ఒప్పందం కదుర్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరులో 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిలోకూడా టీవీలు వస్తాయి.

విద్యా వ్యవస్థలో జగన్ మార్క్ నిర్ణయాలు

విద్యా వ్యవస్థలో జగన్ మార్క్ నిర్ణయాలు


సదుపాయాలు..సంస్కరణలతో పాటుగా.. వారికి ఆర్దికంగా భరోసా - కుటుంబాలకు మద్దతుగా నిలచేలా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. జగనన్న విద్యాదీవెన (ప్రతి త్రైమాసికానికీ పూర్తి ఫీజు రియింబర్స మెంట్‌చెల్లింపు కింద రూ.7678.12 కోట్లు), జగనన్న వసతి దీవెన (వసతి, భోజన ఖర్చుల కింద పిల్లలకు రూ. 3,329.05 కోట్లు), జగనన్న గోరుముద్ద (మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం కింద రూ.3,087 కోట్లు) ఖర్చు చేసారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం కావటంతో.. ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వివరించారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలవాలని కోరారు. తాము తీసుకొస్తున్న మార్పులు పేద విద్యార్ధుల భవిష్యత్ కోసమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

English summary
CM Jagan Mark decision in Education sector in his regime, with Implementing Nadu - Nedu schme many schools looks like Corporate institues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X