పొత్తుల వేళ, ఆ ఇద్దరి మూలాలపై గురి - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు అధికారికం అయింది. బీజేపీ నిర్ణయంపైన స్ఫష్టత రావాల్సి ఉంది.ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ తన ఓట్ బ్యాంక్ బలోపేతం చేసుకొనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటు టీడీపీ కేసుల్లో ఉన్న సమయంలోనే పాజిటివ్ ఓట్ పెంచుకుంటూ... ఆ రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ విషయంలో కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.

పొత్తులతో ప్రతిపక్షాలు:టీడీపీ, జనసేన కలిసి జగన్ ను ఓడించటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ అలర్ట్ అయ్యారు. ఎవరు కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైన టీడీపీ, జనసేన ఆశలు పెట్టుకున్నాయి.

Opinion: CM Jagans vision, prioritizing the main votebank amidst coalition challenges

ఇటు సీఎం జగన్ పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ ను నమ్ముకున్నారు. అదే తనకు తిరిగి అధికారాన్ని నిలబెడుతుందని విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే తన పాలనలో ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు మిగిలి ఉన్న ఆరు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. సంక్షేమ ఓట్ బ్యాంక్ కు మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.

పాజిటివ్ ఓటు పెంచుకొనేలా:అన్ని సర్వేల్లోనూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జగన్ కు అనుకూల వాతావరణం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. టీడీపీ గ్రామీణ ప్రాంతాల్లో బలహీన పడింది. జనసేనకు కొంత వరకు పవన్ ను అభిమానించే వర్గాలు మినహా ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు.

జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి గ్రామాలపైన ఫోకస్ చేసారు. సంక్షేమ పధకాలు, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే కేంద్రాలు, నాడు - నేడు, హెల్త్ సెంటర్లు వంటి నిర్ణయాల తో గ్రామీణ, పట్టణ ఓటర్లలో జగన్ కు అనూహ్య మద్దతు ఉన్నట్లు సర్వేలు తేల్చాయి. దీంతో, ఈ నెల 21 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల తరువాత పల్లెకు పోదాం పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది. దీని ద్వారా ప్రతీ సచివాలయ పరిధిలో పథకాల లబ్దిదారులతో పార్టీ నేతలు మమేకం కానున్నారు. అదే సమయంలో పథకాలకు అర్హులైన వారు ఎవరైనా పథకాలు అందకపోతే వారికి అవకాశం కల్పించటంతో పాటుగా.. పార్టీకి మద్దతు పెరిగేలా స్థానికంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.

Opinion: CM Jagans vision, prioritizing the main votebank amidst coalition challenges

పల్లెల నుంచే ఆరంభం:ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షడు ప్రతి రోజూ తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ సచివాలయానికి ఉదయమే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం ఆసచివాలయం పరిధిలో లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తారు.

ఆతరువాత సదరు లబ్దిదారులతో నేరుగా మమేకం అవుతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మళ్లీ లబ్దిదారులతో మాటా మంతీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. సాయంత్రం పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. మండల అధ్యక్షుడి నేతృత్వంలో గ్రామంలోని పార్టీ ముఖ్య నేతలు భేటీ అవుతారు. ఈ భేటీలో రాత్రి నేతలంతా కలిసి భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో లేదా వార్డులో నేతల మధ్య నెలకొన్న అంతరాలను తొలగించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. ఈక్రమంలోనే దీనితోపాటు కొత్తవారిని చేర్చుకునే అంశంపై చర్చిస్తారు. దీని పైన వచ్చే వారం పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+