ఇంటింటికీ జగన్ ఆర్మీ, గెలుపులో కీలకం - ప్రతిపక్షం టార్గెట్, ధైర్యం చేస్తుందా..!!

సచివాలయాలు. వాలంటీర్లు. ఇప్పుడు ఈ వ్యవస్థ ప్రభుత్వానికి..ప్రజలము మధ్య వారధిగా మారింది. అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రతీ ఇంటికి వాలంటీర్లు దగ్గరయ్యారు. కుటుంబ సభ్యులుగా మారిపోయారు. జగన్ పక్కా వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ వాలంటీర్ల వ్యవస్థే ఇప్పుడు జగన్ సైన్యంగా మారింది. ప్రతీ ఇంటితో మమేకం అయింది. ఇదే సమయంలో ప్రతిపక్షానికి టార్గెట్ అవుతోంది.

ప్రతీ ఇంటికి దగ్గరైన వాలంటీర్లు
ముఖ్యమంత్రి జగన్ 2019లోకి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి 2024 లో గెలుపు కోసం ప్రణాళికలు ప్రారంభించారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలను ప్రారంభించారు. 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దాదాపు 500 రకాల సేవలు ఇంటి ముందే అందిస్తున్నారు.

 Volunteers

పెన్షన్ నుంచి కావాల్సిన ప్రతీ సర్టిఫికెట్ ఇంటి ముందే అందుతోంది. ప్రతీ నెలా పెన్షన్ మొదలు ఆరోగ్య శ్రీ,, రేషన్, ప్రభుత్వ పథకాలు ఇలా అన్ని సేవలు ఇంటి ముందుకు తేవటం ద్వారా వాలంటీర్లు ప్రతీ ఇంటికి దగ్గరయ్యారు. సగటున నెలకు 14,91,155 సేవలు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు. 1,30,964 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఏ సమస్య అయినా 72 గంటల్లో పరిష్కరిస్తున్నారు. దీని ద్వారా ఏ ఇంట ఏ సమస్య వచ్చినా ముందుకు వాలంటీర్ వద్దకు వెళ్తున్నారు.

ప్రభుత్వం..ప్రజల మధ్య వారధిగా
ఇప్పుడు ఏపీలో ప్రతీ ఇంటా అంతలా కలిసిపోయిన వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది. వాలంటీర్లను తన సైన్యంగా సీఎం జగన్ ప్రకటించారు. ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు జగన్ కు అనుకూలంగా పని చేస్తే తమకు నష్టమే అనే అభిప్రాయంతో ప్రతిపక్షాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసే క్రమంలో వాలంటీర్ల పైనా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మహిళల మిస్సింగ్ వెనుక వాలంటీర్లే కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాలంటీర్లకు జీతాలు లేవు. గౌరవ వేతనంగా ప్రభుత్వం వారికి అందిస్తోంది రూ 5 వేలు. ప్రతీ ఏటా వారి సేవలకు వీలుగా పురస్కారాలు అందిస్తోంది. ప్రతీ ఇంటికి అందుబాటులోకి ఉంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాల విమర్శలు తారా స్థాయికి చేరాయి.

 Volunteers

జగన్ సైన్యంగా గుర్తింపు
కానీ, వాలంటీర్లను తొలిస్తామని చెప్పే ధైర్యం మాత్రం ప్రతిపక్షాలు చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసేది ప్రభుత్వమే అయినా లబ్ది దారుల ఎంపిక..వారికి అందేలా చేయటంలో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. ఏ ఇంట ఏ సమస్య వచ్చినా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే గుర్తొస్తుంది వాలంటీర్ వ్యవస్థ.

వీరి సేవలపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థ కు ఆదరణ..నమ్మకం పెరిగింది. ప్రభుత్వ సేవల్లో వాలంటీర్లు...పార్టీ వ్యవహారాల్లో గృహ సారథులు కీలకంగా మారారు. ప్రతీ ఇంటికి తన పాలన..పధకాలతో చేరువ అయ్యేలా పక్కాగా జగన్ ముందుకెళ్తున్నారు. ఆదే వై నాట్ 175 ధీమా. దీంతో...ఇప్పుడు ప్రతిపక్షాలకు వాలంటీర్లు టార్గెట్ గా మారుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+