వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడిన విద్యుత్ కే బిల్లులు .. కరెంట్ బిల్లులపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం : మంత్రి బుగ్గన

|
Google Oneindia TeluguNews

ఏపీలో విపరీతంగా వస్తున్న కరెంట్ బిల్లులపై ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు అధికంగా వస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతుంటే ప్రతిపక్షాలు కూడా దీనిని తీవ్రంగా నిరసిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. అసలే ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటె ఈ విద్యుత్ బాదుడు ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇక మరోవైపు కరెంట్ బిల్స్‌ను జనాలు తీసుకోకుండా పలు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక కరెంట్ బిల్లుల బాదుడుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగించటానికి , ప్రతిపక్ష పార్టీల విమర్శలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు .

Recommended Video

AP Minister Buggana Rajendranath Reddy Given Clarity Over Current Bills Issue

ఏపీలో జనాలకు కరెంట్ బిల్లుల షాక్: వేలల్లో బిల్లులు..టెన్షన్ లో ప్రజలుఏపీలో జనాలకు కరెంట్ బిల్లుల షాక్: వేలల్లో బిల్లులు..టెన్షన్ లో ప్రజలు

కరెంట్ బిల్లులు వాడుకున్నంతే వచ్చాయని, లాక్ డౌన్ సమయంలో ఇళ్ళలో ఉండి ఎండాకాలం కావటంతో ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటంతోనే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం అనవసరపు రాద్ధాంతం చేస్తుందని , దుష్ప్రచారం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక శ్లాబుల ధరలు పెరిగాయని ప్రజలను మభ్యపెడుతున్నారన్న బుగ్గన స్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్లు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.

Oppositions bad propaganda on current bills : minister buggana

విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని హితవు పలికారు. ఇక అంతేకాదు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నామనిఆయన పేర్కొన్నారు . మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ప్రజలకు ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం ఇస్తే అది కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .

English summary
AP Minister Buggana Rajendranath reddy gave clarity on current bills . the ACs and coolers were being used for long periods of time due to summer. He noted that the power consumption of the people has come to a large extent. Finance Minister Buggana Rajendranath Reddy has been agitated that the opposition is making unnecessary strides on electricity bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X