గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ గ్యాంగ్ రేప్ పై జగన్ ప్రభుత్వం టార్గెట్ గా ప్రతిపక్షాల ధ్వజం ; ఒడిశా కూలీల పనేనా? పోలీసుల విచారణ

|
Google Oneindia TeluguNews

గుంటూరు నుండి సత్తెనపల్లి వెళుతున్న క్రమంలో మేడికొండూరు వద్ద మహిళపై జరిగిన దారుణ గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాత్రి 9 గంటలకు దంపతులను అడ్డగించి భర్తను కొట్టి భార్యపై అత్యాచారం చేశారని అంత కంటే దారుణం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయబోతే పోలీసులు ఘటన జరిగింది తమ పరిధిలో కాదని కేసు నమోదుకు నిరాకరించారని తెలుగుదేశం పార్టీ ఏపీలో పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది.

Anasuya Bharadwaj :చీరలో కూడా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అనసూయ.. బ్యూటీఫుల్ ఫొటోస్

మహిళ గ్యాంగ్ రేప్ ఘటనలో సత్తెనపల్లి పోలీసుల తీరుపై టీడీపీ ఫైర్
బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళితే జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి, వెంటనే ఘటన జరిగిన పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేసి ఉంటే సామూహిక అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలు దొరికే వారిని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. కానీ సత్తెనపల్లి పోలీసులు, సంఘటన జరిగిన ప్రాంతం తమ పోలీస్ స్టేషన్ పరిధి కాదని చెప్పి బాధిత మహిళను తిప్పి పంపడం దారుణమని మండిపడుతున్నారు. ఒంటరిగా కాదు భర్త తోడుగా బయటకు వెళ్లినా ఏపీలో మహిళలకు రక్షణ లేదని తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

Opposition targets woman gang rape; accused are Odisha laborers ? Police investigation

జగన్ సర్కార్ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించిన టీడీపీ నేత బీద రవిచంద్ర
గుంటూరు జిల్లా మేడికొండూరు లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన పై జగన్ సర్కారు ఏం సమాధానం చెబుతుందని టిడిపి నేత బీద రవిచంద్ర ప్రశ్నించారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేస్తామని జగన్ సర్కారు ఊదరగొట్టిందని ,మరి సత్తెనపల్లిలో కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదని నిలదీశారు. హైకోర్టు అక్షింతలు వేస్తున్నా కొంతమంది పోలీసు అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని ఆయన మండిపడ్డారు.

భర్తతో కలిసి బయటకు వెళ్లిన భార్యకు కూడా రక్షణ లేదని అనిత ఆగ్రహం
టిడిపి నేత వంగలపూడి అనిత సైతం భర్తతో కలిసి బయటకు వెళ్లిన భార్యకు కూడా రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మేడికొండూరు ఘటన దారుణమని అభిప్రాయపడ్డారు.మహిళలకు ఏపీలో రక్షణ లేదన్నారు. జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. హోమ్ మినిస్టర్ డమ్మీ అని , సత్తెనపల్లి లో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు వంగలపూడి అనిత. ఇక మేడికొండూరు ఘటనపై దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

జీరో ఎఫ్ఐఆర్ లు, దిశ చట్టాలు ప్రచారానికే పరిమితమా : సీపీఐ రామకృష్ణ
బైక్ పై వెళ్తున్న దంపతులను దుండగులు అడ్డగించి కత్తులతో బెదిరించి మహిళను గ్యాంగ్ రేప్ చేయడం అమానుషమని సీపీఐ నేత రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఫిర్యాదు తీసుకోకుండా సత్తెనపల్లి పోలీసులు తమ పని కాదని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. జీరో ఎఫ్ఐఆర్ లు, దిశ చట్టాలు ప్రచారానికే పరిమితమా అంటూ ప్రశ్నించారు రామకృష్ణ. మహిళలపై దురాగతాలు పెరిగిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సత్తెనపల్లి పోలీసులు బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా ఫిర్యాదు తీసుకోని కారణంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసుల అదుపులో అనుమానితులు .. ఒడిశా, విజయనగరానికి చెందిన కూలీల విచారణ
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనలో దర్యాప్తు ప్రారంభించిన మేడికొండూరు పోలీసులు కేసులో పురోగతి సాధించారు. బైక్ పై వెళుతున్న దంపతులపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. పాలడుగు దగ్గర కోల్డ్ స్టోరేజ్ లో పనిచేసే ఎనిమిది మంది కార్మికులు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారంతా ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. ఇక ఇదే సమయంలో ఘటనా స్థలాన్ని డిఎస్పి ప్రశాంతి పరిశీలించి ఈ కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకుంటామని చెబుతున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.

English summary
Medikondur police, has launched an investigation into the Guntur district gang-rape incident, has made progress in the case. Police are investigating the arrest of suspects in the incident in which a couple on a bike was attacked and woman was gang-raped. TDP and CPI leaders are angry at the AP government over the gang-rape of a woman and the Sattenapalli police for not registering an FIR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X