అప్పుడు బుగ్గన, ఇప్పుడు పయ్యావుల-పీఏసీ అభ్యంతరాలకు స్పందన కరవు-రాజకీయ రంగుతో

రాష్ట్ర విభజనతో కుదేలైన ఏపీ ఆర్ధికవ్యవస్ధ ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోతోంది. గతంలో రాజకీయ పార్టీల మధ్య మిగిలిన అంశాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నా ఆర్ధిక వ్యవహారాలకు వచ్చేసరికి సంయమనం పాటించే వారు. కానీ కొన్నేళ్లుగా ఆర్ధిక వ్యవస్ధలో లోపాల్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు చేయని ప్రయత్నం లేదు. ఇందుకు వాడుతున్న ప్రధాన ఆయుధం ప్రజాపద్దుల సంఘం (పీఏసీ). ఆర్దిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు దారితప్పినప్పుడు చక్కదిద్దే పీఏసీ ఛైర్మన్లు లేవనెత్తే అభ్యంతరాలు అధికార పక్షాలకు కంటగింపుగా మారుతున్నాయి.

 పీఏసీల బాధ్యతలు

పీఏసీల బాధ్యతలు

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు చేసే జమాఖర్చుల విషయంలో తలెత్తే లోపాల్ని ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వాటిని చక్కదిద్దేందుకు తమ వంతు తోడ్పాటు అందించడం, తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడటం ప్రజాపద్దుల సంఘాల బాధ్యత. అందుకే ప్రజాపద్దుల కమిటీలకు, ఛైర్మన్ కూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వీరు మాట్లాడే ప్రతీ మాటకూ ఎంతో విలువ ఉంటుుంది. ప్రజల కోసమంటూ ప్రభుత్వాలు ఖర్చుపెట్టే ప్రతీ రూపాయి వివరాలు ప్రజాపద్దుల సంఘానికి చేరతాయి. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాలు వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించడం పీఏసీ ఛైర్మన్ల బాధ్యత.

 పీఏసీ అభ్యంతరాల్ని పట్టించుకోని టీడీపీ, వైసీపీ

పీఏసీ అభ్యంతరాల్ని పట్టించుకోని టీడీపీ, వైసీపీ

ప్రజాపద్దుల సంఘం లేవనెత్తే అభ్యంతరాలపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాయి. గతంలో టీడీపీ సర్కారు ఉండగా ఏం జరిగిందో ఇప్పుడు వైసీపీ సర్కారు హయాంలోనూ అదే జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే రాజకీయ విమర్శలకు ఈ విమర్శలు కేంద్ర బిందువుగా మారిపోతున్నాయి. దీంతో ప్రజాధనం దుర్వినియోగంపై పీఏసీలు లేవనెత్తే అభ్యంతరాలకు విలువ లేకుండా పోతోంది. దీంతో పీఏసీ, దాని ఛైర్మన్లు కూడా నామమాత్రంగా మారిపోతున్నారు.

 అప్పుడు బుగ్గన, ఇప్పుడు పయ్యావుల

అప్పుడు బుగ్గన, ఇప్పుడు పయ్యావుల

గతంలో టీడీపీ ప్రభుత్వంలో పీఏసీ ఛైర్మన్ హోదాలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ఉండేవారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉన్నారు. అప్పట్లో పీఏసీ ఛైర్మన్ హోదాలో బుగ్గన లేవనెత్తిన అభ్యంతరాలకు టీడీపీ ప్రభుత్వం ఏనాడూ సమాధానం చెప్పింది లేదు. ఇప్పుడు పీఏసీ ఛైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలకు వైసీపీ సర్కార్ కూడా ఎదురుదాడితో సరిపెడుతోంది. దీంతో అసలు పీఏసీల అభ్యంతరాలకు విలువ లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 విపక్షాల చేతుల్లో ఆయుధంగా పీఏసీ ఛైర్మన్లు

విపక్షాల చేతుల్లో ఆయుధంగా పీఏసీ ఛైర్మన్లు

విపక్షంలో ఉండే వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంటారు. లేకపోతే బయట రాజకీయ విమర్శలు చేస్తారు. దీంతో పాటు పీఏసీ ఛైర్మన్లుగా ఉండే తమ పార్టీ వారిని వాడుకుంటూ ప్రభుుత్వాలపై విమర్శలు ఎక్కుపెడుతుంటారు. అయితే వీరి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా లేవనెత్తే అభ్యంతరాలు సక్రమమైతే వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో తాజాగా పయ్యావుల కేశవ్ పీఏసీ ఛైర్మన్ హోదాలో ఆర్ధిక వ్యవస్ధలో లోపాలపై లేవనెత్తుతున్న అభ్యంతరాలకు వైసీపీ సర్కార్ ఎదురుదాడితోనే సమాధానం ఇస్తోంది. దీంతో ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+