చేతులు కలుపుతున్న ప్రత్యర్ధులు - ఫలితం డిసైడ్..!!

ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి. అటు కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త రాజకీయం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా మిగిలిన పార్టీల నేతలు చేతులు కలుపుతున్నారు. కురుపాంలో పుష్పశ్రీవాణి హ్యాట్రిక్ పై కన్నేసారు. దీంతో, పుష్పశ్రీవాణికి వ్యతిరేకంగా ప్రత్యర్థులు ఒక్కటవుతున్నారు.

కురుపాం రాజకీయం
కురుపాం నుంచి పుష్పశ్రీవాణి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. అటు టీడీపీ నుంచి జగదీశ్వరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థి మార్పు పైన పలు రకాల చర్చలు టీడీపీలో తెర మీదకు వచ్చాయి. కానీ, ఇప్పుడు మూడో సారి గెలిస్తే నియోజకవర్గంలో మనుగడ ఉండదని గుర్తించిన పుష్ఫశ్రీవాణి ప్రత్యర్థులు చేతుల కలుపుతున్నారు. కొన్నేళ్లుగా శత్రుచర్ల, వైరిచర్ల కుటుంబాలకు వ్యతిరేకంగా పని చేసిన వారంతా ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా కలిసి పని చేస్తున్నారు. కురుపాంలో పుష్ఫశ్రీవాణి సాధించిన పట్టు, చేసిన అభివృద్ధి జీర్ణించుకోలేక కొత్త కుట్రలు మొదలు పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Oppostion parties leaders joining hands against Pushpa Srivani in Kurupam assembly constituency

చేతులు కలిపిన ప్రత్యర్దులు
నియోజకవర్గంలో జియమ్మవలసలో శత్రుచర్ల విజయరామరాజు, డొంకాడ రామక్రిష్ణకు వ్యతిరేకంగా లక్ష్మణరావు వర్గాన్ని తయారు చేసి అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ ఆశావహులతో జతకట్టి విజయరామరాజుకు వ్యతిరేకంగా ప్రచారం చేసి పుష్పశ్రీవాణిని ఎదుర్కోలేక లోపల ఒకలా బయటకు మాత్రం ఒక్కటైనట్లు కనిపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శత్రుచర్ల, వైరిచర్ల ఒకే పార్టీలో ఉన్నా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు మాత్రం పుష్ఫశ్రీవాణికి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. ఇదే నియోజకవర్గంలో శత్రుచర్ల విజయరామరాజు, నిమ్మక జయరాజు మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. కులం విషయంలో విజయరామ రాజును కోర్టులు చుట్టూ తిప్పించిన వ్యక్తి జయరాజు.

Oppostion parties leaders joining hands against Pushpa Srivani in Kurupam assembly constituency

విజయం పై ధీమా
విజయరామ రాజు మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ పైన కేసులు వేసారు. విజయరామ రాజు సోదరి నరసింహ ప్రియ థాట్రాజ్ పైన కేసులు వేసి వేధించారనే ప్రచారం ఉంది. ఇప్పటికీ శ్రతుచర్ల కురుపాం వదిలి పార్వతీపురం, పాతపట్నం లో పోటీ చేసుకుంటున్నారని జయరాజ్ తొడ కొడుతూ చెప్పేవారు.

కానీ, ఇప్పుడు పుష్పశ్రీవాణి ని ఎదుర్కోలేక విజయ రామ రాజు నేరుగా నిమ్మక జయరాజు ఇంటకి వెళ్లి మద్దతు కోరుతున్నారు. అదే విధంగా టీడీపీ అభ్యర్థి మార్పు విషయంలోనూ చివరి వరకు ప్రయత్నాలు జరిగాయి. ఇంత మంది ప్రత్యర్థులుగా ఉన్న నేతలు నేడు పుష్ఫశ్రీవాణికి వ్యతిరేకంగా ఒక్కటైనా సరే... కురుపాం ఓటర్లు మరోసారి వైసీపీకే పట్టం కట్టటం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+