డాక్టర్ నిర్లక్ష్యం: మహిళ ఆహారనాళం కోసేశాడు
విశాఖపట్నం: నిర్లక్ష్యంతో ఓ వైద్యుడు మహిళ ఆహారనాళం కోసేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాయగడ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయబోయి వైద్యుడు ఆహారనాళాన్ని కోసేయడంతో 30 ఏళ్ల మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్సల పాలైంది.
లిమాపదార్ గ్రామానికి చెందిన సరితా పథి, మరో నలుగురు మహిళలు శస్త్రచికిత్స నిమిత్తం రామనగుడా హెల్త్ సెంటర్‌కు శస్త్రచికిత్స నిమిత్తం వెళ్లారు. శస్త్ర చికిత్స సందర్భంగా వైద్యుడు మహిళ ఆహారనాళాన్ని (ఈసోఫాగస్)ను కోసేశాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు.

వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే అది జరిగిందని, సంబంధిత అధికారులకు తాను వైద్యుడిపై ఫిర్యాదు చేశానని, రాష్ట్ర ప్రబుత్వం నుంచి తమకు ఇంకా ఆర్థిక సాయం అందాల్సి ఉందని సరిత భరత్ దిబార్ పథి చెప్పారు.
విచారణ జరిపించాలని తాను సిడిఎంవోను ఆదేశించినట్లు రాయగడ జిల్లా కలెక్టర్ శశి భూషన్ పథి చెప్పారు. రోగి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడం వల్ల తాము ఆర్థిక సాయాన్ని విడుదల చేయలేకపోయామని, ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలని చెప్తే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారని, అయితే ఆమెకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని సిడిఎంవో ఆనంద్ కుమార్ పథి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications