అందరు బీజేపీవైపు: హరి, 'ప్రత్యేక'పై వెంకయ్య షాక్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అందరి చూపి భారతీయ జనతా పార్టీ వైపు ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, విశాఖ ఎంపీ హరిబాబు శనివారం విజయవాడలో అన్నారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

ఏపీని స్వర్ణాంధ్రగానూ, భారత్‌ను బంగారు దేశంగానూ తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీలో చేరేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారని హరిబాబు చెప్పారు.

ప్రత్యేక హోదాపై వెంకయ్య నాయుడు

Other States' not necessary for special status, says Venkaiah

ఇతర రాష్ట్రాల ఆమోదం లేనిదే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వేరుగా స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇతర రాష్ర్టాలు అంగీకరించాల్సిందేనన్నారు. విభజన ప్రక్రియ హడావుడిగా జరిగిందని, ఈ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.

హడావుడి విభజననే అందుకు కారణమన్నారు. ప్రభుత్వ బాధ్యత పరిశ్రమలను నెలకొల్పడం కాదని, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించి, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడమేనన్నారు. మేకిన్‌ ఇండియాతో నిరుద్యోగులకు పుష్కలంగా ఉపాధి లభిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+