కెటిఆర్‌కు క్రమబద్దీకరణ సెగ: అరెస్టులు (పిక్చర్స్)
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలు సోమవారంతో ఐదవ రోజుకు చేరుకున్నాయి.
కాగా రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు అంతటితో ఆగకుండా బారీకేడ్లు తోసుకుని విద్యానగర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి నల్లకుంట పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ మరికొంత మంది విద్యార్థులు ఓయూ పోలీసుస్టేషన్ ఎదుట బైటాయించారు. అరెస్టు చేసిన విద్యార్థులను పోలీసులు విడిచిపెట్టడంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.

ఓయు ఉద్రిక్తతం
సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ఆంధ్రమహిళా సభలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుసుకుని మంత్రి రాకను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు.

ఓయు ఉద్రిక్తం
మంత్రిని అడ్డుకోవాలంటూ విద్యార్థులు ఎన్‌సీసీ గేటు వద్ద గుమిగూడి మంత్రి రాకకోసం ఎదురు చూడం మొదలుపెట్టారు.

ఓయు ఉద్రిక్తం
అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు ఎన్‌సీసీ గేటు వరకు చేరుకుని రహదారికి అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

ఓయు ఉద్రిక్తం
అరగంట తర్వాత మంత్రి కెటిఆర్ కార్యక్రమం రద్దయినట్లు తెలుసుకున్న విద్యార్థులు ఎన్‌సీసీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications