ఢిల్లీ ధర్నాకు జెండా ఊపుతా! 6న ఎంపీల రాజీనామా, పోరాటం ఆగదు: జగన్ సంచలన ప్రకటన

Subscribe to Oneindia Telugu
  YSRCP MPs Will Resign on April 6th, Chandrababu Reaction

  నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం తన పాదయాత్రలో సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లాలోని కలిగిరిలో 86వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు.

  ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని.. ఈ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని అన్నారు.

  రాజీనామాను మొహన కొట్టేస్తారు

  రాజీనామాను మొహన కొట్టేస్తారు

  ఒక వేళ ఏప్రిల్ 6 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయకపోతే.. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి.. వారి మొహన కొట్టేసి వస్తారని జగన్ సంచలన ప్రకటన చేశారు.

  ప్యాకేజీ కోసం బాబు డ్రామాలు

  ప్యాకేజీ కోసం బాబు డ్రామాలు

  ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టారని జగన్ మండిపడ్డారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదాను అసలే అగడం లేదని అన్నారు. ప్యాకేజీ ఇవ్వాలని, రూపాయి, పావలా ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్రమంత్రి సుజనా చౌదరి హోదాతోనే రాష్ట్రానికి నష్టమంటూ విడ్డూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

  లంచాల కోసం ఆశపడొద్దు

  లంచాల కోసం ఆశపడొద్దు

  హోదా తమ హక్కని.. ప్యాకేజీ కోసం ప్రజలను మోసం చేయవద్దని జగన్ అన్నారు. ప్యాకేజీ లంచాల కోసం ఆశ పడవద్దని చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా మార్చి 1న వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్ని కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతారని అన్నారు.

  జెండా ఊపి ఢిల్లీకి పంపిస్తా..

  జెండా ఊపి ఢిల్లీకి పంపిస్తా..

  మార్చి 3న ఎమ్మెల్యేలు, ఎంపీలు తన పాదయాత్రకు వస్తారని జగన్ చెప్పారు. వారందర్నీ తానే జెండా ఊపి మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేసేందుకు పంపిస్తానని జగన్ స్పష్టం చేశారు. మార్చి 8న ఢిల్లీలో వైసీపీ నేతలంతా ఢిల్లీ ధర్నాలో పాల్గొంటారని చెప్పారు.

  ఢిల్లీలో ధర్నా.. 6న ఎంపీల రాజీనామా

  ఢిల్లీలో ధర్నా.. 6న ఎంపీల రాజీనామా

  మార్చి 5 నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తమ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారని జగన్ స్పష్టం చేస్తారని అన్నారు. మార్చి 5 నుంచి చివరి రోజు ఏప్రిల్ 6 వరకు తమ పార్టీ ఎంపీలో పోరాటం చేస్తారని.. అప్పటికీ కేంద్రం హోదా ఇవ్వకపోతే రాజీనామా చేసి వారి మొహన కొట్టి వస్తారని జగన్ చెప్పారు. హోదానే ఊపిరని.. హోదా కోసం పోరాటం ఆగదని జగన్ స్పష్టం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP president YS Jaganmohan Reddy on Tuesday said that his party MPs will resign on April 6th for Andhra Pradesh Special Status.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి