బల్దియా క్యాబ్ స్కీమ్: ఓనర్ కమ్ డ్రైవర్ (పిక్చర్స్)

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని నిరుద్యోగులను ఆదుకునేందుకు బల్దియా ప్రారంభించిన ఓనర్ కమ్ డ్రైవర్ స్కీం వంటి మరిన్ని పథకాలు అందుబాటులోకి రావల్సిన అవసరముందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు ప్రారంభించిన ‘ఓనర్ కమ్ డ్రైవర్ స్కీం'ను బుధవారం ఆయన హైదరాబాదులోని నెక్లెస్‌రోడ్డులో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

కార్యక్రమంలో భాగంగా 105 మంది లబ్దిదారులకు క్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎందరో నిరుద్యోగులకు ఉపాధిని చూపిన ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని తాము ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉన్నత చదువుల చదివి కూడా ఉపాధి అవకాశాలు దొరక్క ఆందోళనలో ఉన్న నిరుద్యోగులను ఈ రకంగా ఆదుకునేందుకు బల్దియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం పట్ల ఆయన కమిషనర్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఎంతో చొరవ తీసుకుని సహకరించిన ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ సంతను ముఖర్జీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంకు రుణం ద్వారా క్యాబ్‌లు పొందిన డ్రైవర్లంతా కూడా సకాలంలో రుణాలు చెల్లించి, వాహనాలకు యజమానులు కావాలని ఆయన సూచించారు.

ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్

ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్

బల్దియా గ్రేటర్ హైదరాబాదులో ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. క్యాబ్‌ను అందించే ఈ పథకాన్ని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

కమ్యూనిటీ హాళ్ల కోసం...

కమ్యూనిటీ హాళ్ల కోసం...

నగరంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 కమ్యూనిటీ హాళ్లను నిర్మించుకునేందుకు వీలుగా స్థలాలను కేటాయించాలని మేయర్ మాజీద్ హుస్సేన్ ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకోసం జిహెచ్‌ఎంసి రూ.కోటిని కేటాయించినట్లు మేయర్ తెలిపారు.

కమ్యూనిటీ హాళ్లలో....

కమ్యూనిటీ హాళ్లలో....

కమ్యూనిటీ హళ్లలో స్వయం సహాయక బృందాలకు ఉపాధి అవకాశాలను కల్పించి ఆదుకునేందుకు పలు కార్యక్రమాలను సిద్దం చేసినట్లు మేయర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

మ్యారేజీ హాళ్లు కూడా..

మ్యారేజీ హాళ్లు కూడా..

మరో రూ.కోటితో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మ్యారేజ్ హాళ్లను కూడా నియమించి పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు మేయర్ వివరించారు. వీటి నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించనున్నట్లు మేయర్ చెప్పారు.

యజమానిగా చేసే స్కీమ్

యజమానిగా చేసే స్కీమ్

నిరుద్యోగ యువకులకు ఉపాధిని కల్పించటంతో పాటు వారి ఓ వాహనానికి యజమానిని చేసే ఈ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ సూచించారు.

వాటాతో యజమాని

వాటాతో యజమాని

నిరుద్యోగ యువకులు తమ వంతు వాటా చెల్లించి వాహనానికి యజమాని అయ్యేందుకు ఈ స్కీం ఎంతో దోహదపడుతుందని కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు.

వాహనాలపై తగ్గింపు

వాహనాలపై తగ్గింపు

మొత్తం రూ. 7లక్షల 2వేల ఖరీదు చేసే వాహనంపై లబ్దిదారులకు రూ. 76వేలను తగ్గింపు ఇస్తున్నట్లు ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ సంతన్ ముఖర్జీ వివరించారు.

వాయిదాలు ఇలా..

వాయిదాలు ఇలా..

మిగిలిన సొమ్ములో లబ్దిదారుడు ఎస్సీ, ఎస్టీ అయితే రూ. 70వేలు, అలాగే మైనార్టీ, బిసి, వోసిలు అయితే రూ. 135వేలను చెల్లించి వాహనాలను పొందేందుకు వీలు కల్పించినట్లు వివరించారు. మిగిలిన సొమ్మును సులభ వాయిదాలపై చెల్లించుకునేందుకు ఆరేళ్ల సమయం ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+