వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆమె అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం సాగుతోంది. ఈశ్వరి టిడిపిలో చేరుతారా అనే చర్చ సాగుతోంద

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆమె అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం సాగుతోంది. ఈశ్వరి టిడిపిలో చేరుతారా అనే చర్చ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పస్టత రావాల్సి ఉంది.

Recommended Video

Watch Video : TDP Anitha Vs YSRCP Giddi Eswari @ AP Assembly Media Point - Oneindia Telugu

విశాఖ జిల్లాలోని వైసీపీలో చోటు చేసుకొన్న పరిణామాలతో గిడ్డి ఈశ్వరీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని ప్రచారం సాగుతోంది.మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబును తిరిగి వైసీపీలో చేర్చుకోవాలనే నిర్ణయం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

రివర్స్: విశాఖలో టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ ఇదే!రివర్స్: విశాఖలో టిడిపికి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ ఇదే!

ఈ విషయమై గిడ్డి ఈశ్వరీ వైసీపీ ముఖ్యనాయకుల వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేశారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.అయితే పార్టీ నాయకత్వం తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నారని ఆమె సన్నిహితులంటున్నారు.

అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం

అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో గురువారం నాడు సమావేశమయ్యారు. పా్రటగీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆమె తన అనుచరులతో సమావేశమయ్యారు. అరకు ఎమ్మెల్యే టిక్కెట్టు విషయమై వైసీపీ నాయకత్వంతో గిడ్డి ఈశ్వరీ విబేధించారంటున్నారు. అయితే ఈ పరిణామాలపై ఈశ్వరీ అసంతృప్తిని వ్యక్తం చేశారని ప్రచారం సాగుతోంది.ఈ పరిణామాలపై పార్టీ నేత విజయసాయి‌రెడ్డి వద్ద చర్చించారనే ప్రచారం సాగుతోంది.తాజాగా చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో గిడ్డి ఈశ్వరీ అనుచరులతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

గిడ్డి ఈశ్వరీ ఏ నిర్ణయం తీసుకొంటారు

గిడ్డి ఈశ్వరీ ఏ నిర్ణయం తీసుకొంటారు

అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం కావడం వైసీపీ వర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. ఈ పరిణామాలు వైసీపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈశ్వరీ టిడిపిలో చేరుతారా అనే చర్చ కూడ ప్రారంభమైంది. వైసీపీలో ఉంటూ టిడిపిని తీవ్రంగా వ్యతిరేకించే ఎమ్మెల్యేలలో గిడ్డి ఈశ్వరి ముందున్నారు.అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులు ఆమెను అసంతృప్తికి గురి చేస్తున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆమె అనుచరులతో సమావేశమయ్యారు. అయితే ఆమె టిడిపిలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని సమాచారం. అయితే పైకి మాత్రం టిడిపిలో చేరే అవకాశం లేదని గిడ్డి ఈశ్వరి చెబుతున్నారు. అయితే వైసీపీని వీడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

అరకు పంచాయితీ

అరకు పంచాయితీ

అరకు అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో ఫల్గుణను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఈశ్వరీ భావిస్తున్నారు.ఈ మేరకు ఫల్గుణ పార్టీలో చేరారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా కూడ చేశారు. వైసీపీ ఇంఛార్జీగా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబును కూడ పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ నిర్ణయం తీసుకోవడంతో ఈశ్వరీ అసంతృప్తి గురైంది. గత ఎన్నికల సమయంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. రవిబాబు పార్టీలో చేరితే ఫల్గుణ పరిస్థితి ఏమిటనేది గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై ఈశ్వరీ పార్టీ నేతలతో చర్చించిందని పార్టీ నేతలు అంటున్నారు. ఈ పరిణామాలతో మనస్థాపానికి ఈశ్వరీ గురయ్యారు.

టిడిపిలో చేరేనా

టిడిపిలో చేరేనా

ఈ నెల 26 లేదా 27 తేదిల్లో గిడ్డి ఈశ్వరీ వైసీపీని వీడి టిడిపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ ప్రచారాన్ని గిడ్డి ఈశ్వరీ కొట్టి పారేస్తున్నారు. పార్టీ నాయకత్వం అనుసరించిన తీరుతో మనోవేదనకు గురైనట్టు ఈశ్వరి సన్నిహితులు చెబుతున్నారు. అయితే రెండు రోజుల్లో ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు .

English summary
There is spreading a rumour on Paderu MLA Giddi Eswari may join in TDP.Giddi Eswari dissatisfied about former MLA K. Ravi Babu issue.Eswari meeting her followers in Paderu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X