భారతదేశంలో అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం మన దగ్గరే

భారతదేశంలో అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం శేరిలింగంపల్లి. తెలంగాణలో ఉన్న ఈ నియోజకవర్గ పరిధిలో 6.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇంతమంది ఓటర్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ఖైరతాబాద్ ఈ స్థానంలో ఉండేది. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో శేరిలింగంపల్లి అతి పెద్ద నియోజకవర్గంగా ఆవిర్భవించింది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి ఐటీ కారిడార్ పరిధిలోకి వస్తుంది.

హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రముఖ ఐటీ హబ్‌లు, చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, అల్విన్ కాలనీ, వివేకానందనగర్, హఫీజ్ పేట ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Serilingampally We have the largest Assembly constituency in India

622 పోలింగ్ కేంద్రాలు కావాలి

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్న ఈ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 6,98,079 మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు 3,70,301 మంది, మహిళా ఓటర్ల సంఖ్య 3,27,636. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 142 మంది ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండడంతో ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరగాలంటే 622 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో శేరిలింగంపల్లి కొత్తగా ఆవిర్భవించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడే ఉన్నాయి. 2009లో తొలిసారిగా నియోజకవర్గమైన తర్వాత ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన భిక్షపతి యాదవ్ విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 2014, 2019, 2023 ఎన్నికల్లో ఆరెకపూడి గాంధీ టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ తరఫున హ్యాట్రిక్ సాధించారు.

గతంలో ఖైరతాబాద్ ఉండేది

శేరిలింగంపల్లికి ముందు దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా 10 లక్షల మంది ఓటర్లతో ఖైరతాబాద్ ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్ ను ముక్కలు చేసి కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ లాంటి వేర్వేరు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో శేరిలింగంపల్లి దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. భౌగోళికంగా రాజస్థాన్ లోని షియో నియోజకవర్గం దేశంలోనే అతి పెద్దది. 6,614 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో అత్యధిక శాతం ఎడారే ఉంటుంది. మొత్తం ఓటర్లు 3 లక్షల మంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+