Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పద్మభూషణ్! బాలయ్యకు చంద్రబాబు, చిరు, పవన్ విషెస్, లోకేష్ ఇలా

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ఎంపిక చేసింది. పద్మ అవార్డు అందకున్నవారిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కింది. నందమూరి బాలకృష్ణకు కళల విభాగంలో పద్మభూషణ్ పుస్కారం లభించింది. సినిమాతోపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలయ్యకు భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ రావడంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Padma Bhushan Congratulations to Balakrishna from film and political leaders

ఐకానిక్ నాయకుడంటూ చంద్రబాబు

పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అంకితభావంతో ఎంతోమందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తినిస్తున్న నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం దక్కిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ముద్దుల మావయ్యా అంటూ లోకేశ్

బాలయ్య అన్‌స్టాపబుల్‌! పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న మీ అందరి బాలయ్య నా ముద్దుల మావయ్య బాలకృష్ణకు అభినందనలు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది బాలయ్యకే సాధ్యం. 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోస్, పాలిటిక్స్ ఎందులోనైనా నంబర్ 1 మన బాలయ్య. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మన బాలయ్య కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 1974లో తాతమ్మ కలతో మొదలైన సినీ ప్రయాణం డాకు మహారాజ్ వరకూ కొనసాగుతూనే ఉందన్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్.

అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్య‌కు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికి 109 సినిమాల్లో హీరోగా చేశారు. అందులో 100 రోజులు కాదు 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఎవరైనా ఒక జానర్‌లో సక్సెస్ అవుతారు. కానీ, అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి తనదైన ముద్ర వేసిన కథానాయకుడు మన బాలయ్య. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సోషియో ఫాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా బాలయ్య కే సాధ్యం. గౌతమీ పుత్రశాతకర్ణిగా మీసం మెలేసినా బాలయ్యే.... అఖండగా గర్జించినా బాలయ్యే. ఆయన నిర్మాతల హీరో, దర్శకుల హీరో, అభిమానుల హీరో. తన సినిమానే కాదు... సినిమా పరిశ్రమ కూడా బాగుండాలి అని భావించే నిజమైన హీరో. పద్మ భూషణ్ అవార్డుతో మన బాలయ్య మరో మెట్టు ఎక్కారు. కంగ్రాట్స్ బాల
మావయ్యా! అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేశ్ పేర్కొన్నారు.

బాలయ్య, అజిత్‌‌కు చిరంజీవి కంగ్రాట్స్

పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న బాలకృష్ణకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. 'డా.డి.నాగేశ్వర రెడ్డి విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, ప్రియమైన మిత్రులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, అనంత్ నాగ్, శేఖర్ కపూర్ జీ,
రుద్రవీణ చిత్రంలో నా సహనటి శోభనకు పద్మభూషణ్ అవార్డు లభించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అరిజిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మ, ప్రతి ఒక్కరు పద్మ అవార్డు గ్రహీతలకు చిరంజీవి అభినందనలు తెలియజేశారు. మరోవైపు, హీరో నాని కూడా బాలయ్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

రాజమౌళి అభినందనలు

ఈసారి తెలుగు వారికి 7 పద్మ అవార్డులు... పద్మభూషణ్‌తో సత్కరించబడిన నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు! భారతీయ సినిమాలో మీ ప్రయాణం నిజంగా ప్రశంసనీయం... అలాగే, ఇతర ప్రముఖ తెలుగు మరియు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు... :) అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పద్మభూషన్ అందుకున్న తమిళ నటుడు అజిత్‌ కుమర్‌కు కూడా అభనందనలు తెలియజేశారు.

బాలయ్యకు పవన్ ప్రత్యేక అభినందనలు

ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ - హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు.
ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి.నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ కు ఎంపికైనందుకు అభినందనలు. ప్రజా ఉద్యమాల్లో మంద కృష్ణ మాదిగకి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. మంద కృష్ణ మాదిగ పద్మశ్రీకి ఎంపికైనందుకు అభినందనలు.

మట్టిలో మాణిక్యాలు

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన కె.ఎల్.కృష్ణ, వి.రాఘవేంద్రాచార్య పంచముఖికి అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. మట్టిలో మాణిక్యాల్లాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30 మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కింది అని పవన్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+