తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా పేషెంట్ల కోసం టీటీడీ భారీ స్కీం: పద్మావతి ఆసుపత్రిలో..యుద్ధ ప్రాతిపదికన: కొత్త తరహా మాస్కులు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు అందించే వైద్య చికిత్స కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచబోతోంది. కొత్తగా 500 పడకలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టింది. 48 గంటల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన 500 పడకలను అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనితో పాటు పెద్ద ఎత్తున వెంటిలేటర్లను తెప్పించబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

పద్మావతి వైద్య కళాశాల, ఆసుపత్రిని ప్రత్యేకంగా కరోనా పేషెంట్ల కోసం మార్పు చేశారు. దీన్ని తాత్కాలికంగా కోవిడ్ ఆసుపత్రిగా కిందటి నెలలోనే మార్పులు చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో కలిసి పర్యటించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటిలేటర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొరత రాకుండా చూడాలని అన్నారు.

జిల్లాలో కరోనా వైరస్ పేషెంట్ల కోసం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టామని అన్నారు. పద్మావతి మెడికల్ కాలేజీలో వైద్య పరికరాలు, పీపీఈ కిట్లను కొనుగోలు చేయడానికి 20 కోట్ల రూపాయల మొత్తాన్ని టీటీడీ తరఫున జిల్లా కలెక్టరుకు మంజూరు చేసినట్లు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల కోసం చేపట్టిన అన్నదానం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. లాక్‌డౌన్ పరిస్థితులు ముగిసేంత వరకూ శ్రీవారి అన్న ప్రసాదాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. తిరుపతి సహా పరిసర ప్రాంతాల్లో రోజుకు 1.40 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తున్నామని చెప్పారు.

Padmavathi Medical College hospital capacity to increase, says TTD Chairman

Recommended Video

Coronavirus Lockdown : Watch Wild Bears Roam Freely In Tirumala

లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం తెరవబోమని చెప్పారు. స్వామివారికి యథావిధిగా నిత్యపూజలు, కైంకర్యాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా స్వామి వారి సేవల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రీఫండ్ చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తామని చెప్పారు.

English summary
Padmavathi Medical College hospital capacity to increase after declared as Covid-19 Coronavirus hospital. Tirumala Tirupati Devasthanams Chairman YV Subba Reddy have visits the Hospital on Friday and issued the orders for 500 beds next 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X