ఇదేనా ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం?: బాబు ఇంటి వద్ద ఎమ్మెల్యే హైడ్రామా!?

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: సొంత పార్టీని, సొంత పార్టీ నేతలను విమర్శించి గతంలో వార్తల్లోకి ఎక్కిన పలాస ఎమ్మెల్యే శివాజీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సీఎం కాన్వాయ్ వస్తుందన్న కారణంతో భద్రతా అధికారులు తన వాహనాన్ని నిలిపివేయడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

భద్రతా అధికారుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే శివాజీ రోడ్డుపైనే బైఠాయించారు. కాగా, సీఎం నివాస ప్రాంతం ఉండవల్లికి దారితీసే రహదారిపై శివాజీ నిరసనకు దిగారు. సీఎం కాన్వాయ్ వస్తుందని చెప్పి, తన వాహనాన్ని పక్కన నిలిపివేశారని శివాజీ ఆరోపించారు. పోలీసులు చేసిన ఈ చర్య ఎమ్మెల్యేగా ఉన్న తనను అగౌరవపరచడమేనని అన్నారు.

palasa MLA Sivaji protest against police

తన కారు సీఎం కాన్వాయ్ కన్నా ముందే ఉండవల్లి దాటి ఉండేదని, అకారణంగా పోలీసులు తన వాహనాన్ని ఆపేశారని శివాజీ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. విషయం తెలుసున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు అచ్చెన్నాయుడిని ఆయన వద్దకు పంపించినట్లు తెలుస్తోంది.

దీంతో శివాజీ నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లిన అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే శివాజీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అచ్చెన్నాయుడు బుజ్జగింపులకు తలొగ్గని ఎమ్మెల్యే శివాజీ పోలీసులు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Palasa MLA Sivaji made protest on highway demanding the apology from police for stopping his vehicle while going towards Undavalli
Please Wait while comments are loading...