Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పలాస వైసీపీలో పైలా పచ్చీస్!!

పలాస వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలాస వైసీపీలో స్థానికంగా వస్తున్న భూ కబ్జాల ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నట్టు పేర్కొన్నారు.

పలాస నియోజకవర్గంలో పైలా పచ్చీసు మొదలైందా? వైసిపి ఎమ్మెల్యేలకు, మంత్రులకు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతుందా? అందుకు కొందరు వైసీపీ నేతలు పలాస నియోజకవర్గంలో వైసిపి పై కొనసాగుతున్న ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేయడం అందుకు ఊతమిస్తుందా ? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

 వైసీపీలో జగన్ ఆలోచన ఒకలా .. నేతల తీరు ఇలా

వైసీపీలో జగన్ ఆలోచన ఒకలా .. నేతల తీరు ఇలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క బలమైన పార్టీగా ఎన్నికలలోకి వెళ్లాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, కొన్నిచోట్ల పార్టీ క్యాడర్లో చోటుచేసుకుంటున్న అసంతృప్తి వైసీపీకి తలనొప్పిగా మారుతుంది. నేతల మధ్య సమన్వయం లేకపోవటం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల తీరుపై ద్వితీయ స్థాయి కేడర్ లో అసంతృప్తి ఉండటం వంటి కారణాలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి.వైసీపీలో చాప క్రింద నీరులా అనేక ప్రాంతాలలో నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు పార్టీ నాయకులకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.

పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుపై సొంతపార్టీ నేతల గుర్రు

పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుపై సొంతపార్టీ నేతల గుర్రు

తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు వైఖరిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. సీదిరి అప్పలరాజు పార్టీలో ఓ వర్గానికే పెద్ద పీట వేస్తున్నారని, మరో వర్గం నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మంత్రి వైఖరిని టార్గెట్ చేస్తున్న వైసిపి లోని ఒక వర్గం నాయకులు గత సంవత్సరం వనభోజనాల సమయంలో తమను పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

అయినప్పటికీ ఇప్పటివరకు పరిస్థితిలో ఏ విధమైన మార్పు రాకపోవడంతో ఇప్పుడు కొత్త ఆలోచనతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నట్టు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీపై వస్తున్న భూకబ్జాల ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నామన్న నేతలు

వైసీపీపై వస్తున్న భూకబ్జాల ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నామన్న నేతలు

పలాస నియోజకవర్గంలో వైసిపిలోని ఒక వర్గం నేతలు దువ్వాడ హేంబాబు చౌదరి, జుత్తు నీలకంఠం, దువ్వాడ శ్రీకాంత్ లు గత కొంతకాలంగా మంత్రి సీదిరి అప్పలరాజు తమను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నారని తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే వారు పలాస నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అనేక ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని నిజనిర్ధారణ కమిటీ వేసి ప్రతి గ్రామానికి వెళతామని చెబుతున్నారు.

అనేక భూ కబ్జాల ఆరోపణలు వెల్లువగా వస్తున్న వేళ ప్రతి గ్రామానికి వెళ్లి వస్తున్న ఆరోపణలలో వాస్తవం ఎంత అనే విషయాన్ని తెలుసుకొని, వాటిని నివేదికగా రూపొందించి పార్టీలోని జిల్లా నాయకులతో పాటుగా, సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తామని తేల్చి చెబుతున్నారు.

జగన్ కు రిపోర్ట్ పంపిస్తామన్న నేతలు .. ఆ మంత్రికి ఇబ్బంది?

జగన్ కు రిపోర్ట్ పంపిస్తామన్న నేతలు .. ఆ మంత్రికి ఇబ్బంది?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు అవినీతి చేసినా అది పార్టీకి ఎఫెక్ట్ అవుతుందని చెబుతున్న వైసిపి నేతలు ప్రజలు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళతామన్నారు. వైసీపీలో అవినీతి జరగకుండా ఉండడం కోసం తామంతా కలిసి గ్రామాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని పేర్కొన్నారు.

అయితే వైసిపిలో మంత్రిని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని గ్రామాలలో పర్యటించి నివేదిక రూపొందిస్తామని చెప్పడంతో, మంత్రి సీదిరి అప్పలరాజుపై గత కొంత కాలంగా పార్టీలో ఒక వర్గంలో అసంతృప్తి ఉన్న నేపధ్యంలో ఈ పరిణామాలు ఆసక్తిగా మారాయి. .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+