Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు మాటలను వక్రీకరిస్తున్నారు"

సీఎం చంద్రబాబునాయుడు.. స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్న దాన్ని కేంద్రం నుండి రాష్ట్రం సుమారు రూ. 14 వేల కోట్లు తీసుకొచ్చిందన్నారు. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుందని.. దానిపట్ల బాధ్యతగా ఉండాల్సింది మాని లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంట్ ను ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదని తెలిపారు.

"కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి రూ.14 వేల కోట్లల్లో రూ.11 వేల కోట్లు తీసుకువచ్చాం. రాష్ట్రం నుంచి కూడా సుమారు రూ.2,600 కోట్లు ఆర్థిక సాయం అందించాం. 30 శాతం పనులు జరుగుతున్న ప్లాంట్ ని 80 శాతం పనులు జరిగేలా చేశాం. పబ్లిక్ సెక్టార్ లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్ మెంట్, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలి. వైసీపీ నాయకులతో కలిసి కొందరు వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడారు. లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు" అని పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"చంద్రబాబు కృషితోనే ఈ ప్లాంట్ లాభాలబాటలో నడుస్తోంది. కార్మికులు, ప్రజానీకం, స్టీల్ ప్లాంట్ లోని వారందరు గ్రహించాలి. 2000వ సంవత్సరంలో కూడా వాజ్‌పేయి రూ. 1350 కోట్లు తీసుకొచ్చి ప్లాంట్ ను నిలబెట్టారు. రెండోసారి రూ. 1440 కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ ను నడిపారు. చంద్రబాబునాయుడు గురించి చెడుగా మాట్లాడడం మంచిదికాదు. నేడు స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీయే కూటమి వలననే అన్న విషయం అందరూ గమనించాలి. అధికారులపై బురద జల్లడం మంచి పద్దతి కాదు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షానికి కూడా ఆ బాధ్యత ఉండాలి. లేనిపోని అపోహలు సృష్టించడం మంచిదికాదు. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. అందులో భాగంగానే కేంద్రాన్ని ఒప్పించి రూ. 11,400 కోట్లు తీసుకొచ్చాం" అని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.

"రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టే ప్రభుత్వం నుంచి నీరు, విద్యుత్, పన్నులు ఇతరత్రా రూపంలో సుమారు 2,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ కు కూడా రాష్ట్రం పెట్టిన దాఖలాలు లేవు. ఏపీలో కార్మికులను, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేడు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి నిధులు తెచ్చాం" అని తెలిపారు.

Palla Srinivas Slams CM Naidu You re Twisting My Words on Vizag Steel Plant Privatization

"కావున పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ ఫేర్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజా ధనాన్ని అందులో వెచ్చిస్తున్నాం. అందరూ బాధ్యతగా ఉండాలి. వక్రీకరించడం సబబుకాదు. కార్మికులను భయాందోళనకు గురి చేయొద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ఈ ప్రయత్నాలు మానుకోవాలి. ఎంత వక్రీకరించి మాట్లాడినా ప్రజలు విజ్ఞులు కావున అర్థం చేసుకోగలరు. ఎన్డీయే కూటమిపై ప్రజలకు అపార నమ్మకం ఉంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులే కాకుండా ప్రతిపక్షం కూడా బాధ్యతగా ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+