టి చర్చ: సభలో 'సోనియా' గందరగోళం, పోటీ నినాదాలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రస్తావించడం గందరగోళానికి దారి తీసిది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని పల్లె ఆరోపించారు.
దీనిని ఇరు ప్రాంతాల కాంగ్రెసు నేతలు తప్పు పట్టారు. పల్లె వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందిస్తూ... తెలుగుదేశం పార్టీ మాట మీద నిలబడక పోవచ్చు కానీ తమ పార్టీ నిలబడిందని అన్నారు.

2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది టిడిపి అని, 1997లో బిజెపి కాకినాడలో తెలంగాణ కోసం తీర్మానం చేసిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆర్టికల్ 3 ప్రకారం విభజించాలని సూచించిందని.. ఇలా అన్ని పార్టీలు చెప్పాకనే కాంగ్రెసు చివరగా నిర్ణయం తీసుకుందని ద్రోణంరాజు శ్రీనివాసు అన్నారు. సోనియా ఒక్కరినే నిందించడం సరికాదన్నారు. సోనియాను తప్పు పట్టడాన్ని రికార్డుల నుండి తొలగించాలన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారనడం ఎంత మాత్రం సమంజసం కాదని మంత్రి కొండ్రు మురళీ అన్నారు. రాహుల్ ప్రధాని కావాలనుకుంటే ఈ పదేళ్లలో ఎప్పుడైనా అయ్యేవాడన్నారు. సోనియా కుటుంబం త్యాగానికి మారు పేరు అన్నారు.
విభజనలో ఏ పార్టీకి ఎంత భాగస్వామ్యం ఉందో ప్రజలందరికీ తెలుసునని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు సోనియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభాపతి సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications