పొత్తులపై చర్చ, 28న లిస్ట్: డిగ్గీ, కోమటిరెడ్డిపై పాల్వాయి

కోమటిరెడ్డిపై పాల్వాయి ఫైర్
నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరుల పైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమన్నారు. కోమటిరెడ్డి గతంలో అధినేత్రి సోనియా గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు, ఇతర పార్టీలతో జరిపిన సంప్రదింపులు హైకమాండ్‌కు తెలుసునని పాల్వాయి పేర్కొన్నారు.
కోమటిరెడ్డి సోదరులు వైయస్ హయాంలో కాంట్రాక్టుల పేరిట కోట్లు కూడబెట్టారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పని చేశారన్నారు. ఇతర పార్టీలతో వారు సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు.
పాల్వాయి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవిపై తమ పార్టీ అధిష్టానం నుండి హామీ లభించనందునే కెసిఆర్ తన పార్టీని విలీనం చేయలేదన్నారు. కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేస్తే 70 సీట్లు సాధిస్తుందన్నారు. తెరాస మాత్రం నలభై సీట్లకు మించి గెలవదన్నారు. హరీశ్ రావు లేవనెత్తిన పది అంశాలపై చర్చకు తాను సిద్దమన్నారు.
ఓట్ల కోసం రాజకీయాలొద్దు: రాజయ్య
ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేయవద్దని, అమరుల ఆత్మలు క్షోభిస్తాయని ఎంపి రాజయ్య అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు.
జైపాల్ పోటీ చేయకుంటే..
కాంగ్రెసు పార్టీ స్క్రీనింగ్ కమిటీతో సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబులు భేటీ అయ్యారు. చేవెళ్ల లోకసభ నియోజకవర్గం నుండి జైపాల్ రెడ్డి పోటీ చేయకుంటే ఆ టిక్కెట్ తన తనయుడికి ఇవ్వాలని సబిత స్క్రీనింగ్ కమిటీని కోరినట్లుగా తెలుస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications