రోజా నీ స్థాయి ఏంటి? నీకా దమ్ముందా: భగ్గుమన్న పంచుమర్తి అనురాధ!!
నిజం గెలవాలి బస్సుయాత్ర పై, నారా భువనేశ్వరి పై వైసిపి మంత్రి రోజా ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే చంద్రబాబుతో పాటు భువనేశ్వరి కూడా జైలుకు వెళ్తారని రోజా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రోజాను టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ టార్గెట్ చేశారు. రోజాకు నోటికొచ్చినట్టు మాట్లాడవద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రోజా.. నీ స్థాయి ఏంటి? నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పంచుమర్తి అనురాధ ఆడదానివి మంచి భాష కూడా మాట్లాడలేకపోతున్నావ్ అంటూ మండిపడ్డారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన నువ్వు ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో సిబీఐ ఎంక్వయిరీ కోరే దమ్ము నీకుందా అంటూ పంచుమర్తి అనురాధ మంత్రి రోజాను ప్రశ్నించారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేసిన పంచుమర్తి అనురాధ, మంత్రి రోజా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ, ఈడి ఎంక్వయిరీ త్వరగా చేయాలని కోరే దమ్ము నీకు ఉందా? లేదా మీ జగన్ కు ఉందా? అంటూ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.
16 కార్లు, నాలుగు పెట్రోల్ బంకులు నీకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు లాక్కున్నావని మంత్రి రోజాను విమర్శించారు. రోజా, రోజా అన్నదమ్ములు అనకొండల్లా నగరిని దోచుకున్నారని, నువ్వు సంపాదించిన వందల కోట్ల మీద సిబిఐ ఎంక్వయిరీ కోరే దమ్ము నీకు ఉందా అంటూ పంచుమర్తి అనురాధ నిలదీశారు.
ఉదయం ఎక్సర్సైజులు ,మధ్యాహ్నం నాన్వెజ్ భోజనం, రాత్రిపూట పార్టీలు తప్ప నగరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం ఏం చేశావో చెప్పాలని పంచుమర్తి అనురాధ నిలదీశారు. పక్క వాళ్ళని ప్రశ్నించే ముందు నీకు సిబిఐ ఎంక్వయిరీ కోరే ధైర్యం ఉందా చెప్పాలని పంచుమర్తి అనురాధ మంత్రి రోజాకు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications