రేపు అమరావతికి పన్నీర్ సెల్వం: చంద్రబాబుతో భేటీ కోసం..
తెలుగు గంగ పథకం కింద చెన్నై తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాల్సిందిగా పన్నీర్ సెల్వం చంద్రబాబును కోరనున్నారు.
విజయవాడ: కృష్ణా జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై చంద్రబాబును ప్రత్యక్షంగా కలిసి సమస్య గురించి వివరించబోతున్నారు పన్నీర్ సెల్వం.
ఇందుకోసం ఆయన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు. రాజధానిలోని సచివాలయ ప్రాంగణంలో పన్నీర్ సెల్వం చంద్రబాబుతో భేటీ అవనున్నారు. తెలుగు గంగ పథకం కింద చెన్నై తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాల్సిందిగా పన్నీర్ సెల్వం చంద్రబాబును కోరనున్నారు.

అంతకుముందు లేఖ..
జనవరి 5వ తేదీకి కండలేరు రిజర్వాయర్‌లో 13.53టీఎంసీల నీటి నిల్వ ఉందని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చెన్నైకి నీటిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications