చిన్నారికి విషమిచ్చి తల్లిదండ్రుల ఆత్మహత్య
చిత్తూరు: ఐదు నెలల చిన్నారికి విషమిచ్చి, ఆ తర్వాత తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరులోని గాంధీనగర్‌లో సోమవారం జరిగింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా హోంగార్డు దంపతులు ఈశ్వర్ (31), రజనీ (24) మార్గమధ్యలోనే చనిపోయారు. ఆర్టీవో కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న ఈశ్వర్ (31), రజనీ (24) దంపతులు.
వీరికి 5నెలల క్రితం మగబిడ్డ రుత్విక్ పుట్టాడు. అయితే పుట్టినప్పటి నుంచి శ్వాస కోస వ్యాధితో బాధపడుతున్న రుత్విక్‌ను బతికించుకునేందుకు తిరుపతిలోఅని అమ్మ ఆసుపత్రి, వేలూరు సిఎంసి ఆసుపత్రిలో నెల రోజులుగా సర్వశక్తులువొడ్డారు. బిడ్డ ప్రాణాల కోసం ఈశ్వర్ సుమారు రెండున్నర లక్షల రూపాయలు అప్పు చేశాడు.
అంతేకాకుండా కుటుంబంలో కలహాలు కూడా చోటు చేసుకోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెపుతున్నారు. అయితే ఈశ్వర్ తండ్రి సంపంగి మాత్రం బిడ్డ ఆరోగ్యం కుదుట పడటం కోసం అప్పులు చేయడంతో ఆర్థికభారం తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడని అంటున్నారు.

ఉదయం 8.50 గంటల సమయంలో బెడ్‌రూమ్‌కు తాళం వేసుకుని లోపల పసిబిడ్డకు విషమిచ్చి, దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతసేపటికి చండిబిడ్డతోపాటు కుమారుడు, కోడలు బిగ్గరగా అరుస్తుండటంతో కుటుంబీకులు మరో తాళంతో తలుపులు తీసి చూసేసరికి ప్రమాదకర స్థితిలో ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నారని భావించి ముగ్గుర్నీ ఆసుపత్రికి తరలించారు.
ఎక్కువ మోతాదులో బిడ్డకు విషమివ్వడంతో అక్కడిక్కడే మృతి చెందారని, ఈశ్వర్ దంపతులు మాత్రం ఆస్పత్రికి వచ్చే సమయానికే చనిపోయారని డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అక్కడ ఉన్న పురుగుల మందు డబ్బాలను, ఇతర పత్రాలను, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ‘మమ్మల్ని క్షమించండి. బ్రతకడం ఇష్టంలేదు. ఇట్లు మీ ..' అని మాత్రమే ఉందని పోలీసులు చెప్పారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications