Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాపను కారులో మరచి దైవ దర్శనానికి వెళ్ళిన తల్లిదండ్రులు; తిరిగి వచ్చేసరికి..

ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది మరచి తమకేమి పట్టదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటన నంద్యాల జిల్లా మహానందిలో చోటుచేసుకుంది. ఒక చిన్నారిని తల్లిదండ్రులు కారులో మరిచిపోయి మహానందిలోని ఆలయానికి దర్శనానికి వెళ్లారు. కారులో నిద్రిస్తున్న చిన్నారి ఊపిరాడక ఏడవడం ప్రారంభించింది. భార్యాభర్తల మధ్య సమన్వయలోపం చిన్నారిని కారులోనే మరిచిపోయి వెళ్లేలా చేసింది.

పసిపాపను కారులోనే వదిలేసి దైవ దర్శనానికి
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ కు చెందిన రాజు తన భార్య పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం వెళ్ళాడు. రాజు తమ వాహనాన్ని నంది సర్కిల్లో పార్క్ చేశారు. భర్త పాపను తీసుకు వస్తాడని భావించిన భార్య కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది. ఇక భార్య పాపను తీసుకు వెళ్లిందని భావించిన భర్త పాపను కారులోనే వదిలేసి వెళ్లాడు.

parents forgot baby in car and went for mahanandi temple darshan constable saved baby life

Take a Poll

కారులో ఊపిరాడక ఏడ్చిన పాప
ఇద్దరు వేరువేరుగా దైవదర్శనానికి వెళ్లారు. దీంతో చిన్నారి కారులోనే ఉండిపోగా అద్దాలు క్లోజ్ ఉండి, కారు లాక్ పడడంతో చిన్నారికి నిద్ర నుండి మెలకువ వచ్చింది. ఊపిరాడక చిన్నారి కారులోని ఏడుస్తూ ఉండడం గమనించిన స్థానికులు దేవస్థానంలోని సమాచార కేంద్రంలో ఉన్న ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలిపారు. వారు కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు ఈ విషయం చెప్పడంతో వెంటనే ఆయన కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశాడు.

పసిపాపను కాపాడిన కానిస్టేబుల్
అప్పటికే పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. పాపను సమాచార కేంద్రంలో సపర్యలు చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇక ఈ సంఘటనలో కానిస్టేబుల్ వెంటనే ప్రతిస్పందించడం వల్ల ఓ పసిపాప ప్రాణాలు దక్కాయి. దేవస్థానం సిబ్బంది తల్లిదండ్రులను వెంటనే వచ్చి పాపను తీసుకు వెళ్లవలసిందిగా మైక్ లో చెప్పిన పావుగంట తర్వాత తల్లిదండ్రులు వచ్చి పాపను తీసుకువెళ్లారు.

కానిస్టేబుల్ వచ్చి పాపను కాపాడకపోయి ఉంటే
ఈ సంఘటనలో చంటి పాప పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రుల తీరుపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి కానిస్టేబుల్ వచ్చి కాపాడక పోయి ఉంటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు .చిన్నపిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని అడుగుతున్నారు.

కానిస్టేబుల్ ను అభినందించిన హోం మంత్రి అనిత
ఇక ఈ సంఘటన తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మహానందిలో చిన్నారి ప్రాణం కాపాడిన మహానంది పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ ను అభినందించారు. ఎక్స్ వేదికగా ఆమె పాప ప్రాణాలను కాపాడడానికి చొరవ చూపిన కానిస్టేబుల్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు అంటూ ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+