కాకిలెక్కలు చెప్పొద్దు: పరిటాల సునీత హెచ్చరిక
అనంతపురం: ప్రజలకు తాగునీటి సౌకర్యాల కల్పనపై కాకి లెక్కలు చెప్పొద్దని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాప్తాడు నియోజకవర్గంలో అధికారులతో వివిధ పథకాలు అమలు తీరు తెన్నులపై ఆమె అనంతపురంలో శనివారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉందనేది తనకు బాగా తెలుసునని.. కథలు చెప్పడం మానేసి వాస్తవాలు చెప్పాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారుల్ని తీవ్రంగా మందలించారు.

జిల్లాల్లో ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా పేదలకు రాగులు, జొన్నలు ఇతరత్రా తృణ ధాన్యాలు రేషన్ దుకాణం ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నవంబర్ 1 నుంచి అనంతపురం జిల్లాలో తెల్లరేషన్ కార్డుదారులకు 5కేజీల రాగులు ఇస్తామని సునీత చెప్పారు.
తెల్లకార్డులపై రేషన్ తీసుకోకపోయినా కార్డు రద్దు చేయకుండా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెఇపారు. పలు పథకాల్లో క్షేత్రస్థాయికి భిన్నంగా అవాస్తవాలు చెబుతున్న కొందరుఅధికారులను ఆమె హెచ్చరించారు. చౌకధాన్యపు డిపోల్లో తూకాల్లో మోసాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.












Click it and Unblock the Notifications