రెచ్చగొట్టొద్దు: జగన్‌కు సునీత, నాతో మాట్లాడేందుకు బాబు నో: ముద్రగడ

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం/రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి పరిటాల సునీత ఆదివారం నాడు హితవు పలికారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో 'రంజాన్ తోఫా' సరుకులను ఆమె పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. రంజాన్ తోఫా సరకులు అందరికీ పంపిణీ చేస్తున్నామని, సరకులు సరిగా పంపిణీ చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీలు చేస్తున్నామని, వైసిపి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు.

CM Chandrababu

చంద్రబాబుపై ముద్రగడ ఆగ్రహం

దీక్ష సమయంలో తనను దారుణంగా హింసించారని, ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్ చూపించిందని కాపు నేత ముద్రగడ ఓ పత్రికతో మాట్లాడుతూ చప్పారు. ఓ సమయంలో చంద్రబాబుతో మాట్లాడేందుకు ఎంతగా ప్రయత్నించినా, తనతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు.

టిడిపి తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని మాత్రమే అమలు చేయాలని తాను డిమాండ్ చేస్తున్నప్పటికీ, తనపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. తుని ఘటన తర్వాత తాను చంద్రబాబుతో మాట్లాడాలని ప్రయత్నించగా, అందుకు చంద్రబాబు ఇష్టపడలేదన్నారు.

ముద్రగడా! నా భర్తను లాగకు, బాబు నాకు దేవుడు: సునీత, బీజేపీ ఎమ్మెల్యే షాక్

తుని విధ్వంసంపై మరింత లోతైన విచారణకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆపై మాట తప్పారని, సీబీఐ విచారణకు డిమాండ్ చేయవద్దని మంత్రులే తనను కోరారని అన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై బీసీలకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలన్నదే తన అభిమతమన్నారు. రిజర్వేషన్లు రాకుంటే, మది దశ ఉద్యమం ఎలా సాగాలన్నది కాపు జేఏసీ నిర్ణయిస్తుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Paritala Sunitha lashes out at YSRCP cheif Jagan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి